Sameer Khandekar: ప్రొఫెసర్ సమీర్ ఖండేకర్ మృతి
ప్రొఫెసర్ ఖండేకర్ ఆడిటోరియంలో ప్రసంగిస్తుండగా అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి అనిపించి కాసేపు కూర్చున్నాడు. అయితే కొంతసేపటికి స్పృహతప్పి పడిపోయాడు.
- By Praveen Aluthuru Published Date - 07:51 PM, Sat - 23 December 23

Sameer Khandekar: ఐఐటీ కాన్పూర్‌కు చెందిన ఓ సీనియర్ ప్రొఫెసర్ లెక్చర్ ఇస్తూ స్టేజి మీదనే కుప్పకూలిపోయారు. ప్రొఫెసర్ సమీర్ ఖండేకర్ పూర్వ విద్యార్థుల సమావేశ కార్యక్రమంలో ప్రసంగించారు. ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో ప్రజలకు తెలియజేశారు. ఈ సమయంలో అతను వేదికపై గుండెపోటుకు గురయ్యాడు. పోస్టుమార్టం రిపోర్టు ఇంకా రానప్పటికీ గుండెపోటు వచ్చిందని వైద్యులు అనుమానిస్తున్నారు.
ప్రొఫెసర్ ఖండేకర్ ఆడిటోరియంలో ప్రసంగిస్తుండగా అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి అనిపించి కాసేపు కూర్చున్నాడు. అయితే కొంతసేపటికి స్పృహతప్పి పడిపోయాడు. అనంతరం కార్డియాలజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు నిర్ధారించారు.
Also Read: Hyderabad: హైదరాబాద్ లో సరి-బేసి విధానం