HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Icc World Cup 2023 India Restrict Australia To 199 All Out

World Cup 2023: చెపాక్ లో ఆసీన్ ను దెబ్బకొట్టిన బౌలర్లు.. 119కే ఆలౌట్

చెన్నై చెపాక్ స్టేడియంలో టీమిండియా బౌలర్ల ధాటికి ఆసీస్ బ్యాటింగ్ విభాగం కుప్పకూలిపోయింది. 49.3 ఓవర్లకు పది వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా 199కి ఆలౌట్‌ అయింది.

  • Author : Vamsi Chowdary Korata Date : 08-10-2023 - 6:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
World Cup 2023 (19)
World Cup 2023 (19)

World Cup 2023: చెన్నై చెపాక్ స్టేడియంలో టీమిండియా బౌలర్ల ధాటికి ఆసీస్ బ్యాటింగ్ విభాగం కుప్పకూలిపోయింది. 49.3 ఓవర్లకు పది వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా 199కి ఆలౌట్‌ అయింది. ఇన్నింగ్స్ లో రోహిత్ కెప్టెన్సీ, స్పిన్నర్లు రెచ్చిపోగా, పేసర్లు శుభారంభం అందించారు.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఓపెనర్ మిచెల్‌ మార్ష్‌ బుమ్రా బౌలింగ్ లో జీరో పరుగుకే పెవిలియన్ బాట పట్టాడు. బుమ్రా బౌలింగ్ లో మార్ష్ విరాట్ కోహ్లీకి క్యాచ్ అందించి డకౌట్‌ తో వెనుదిరిగాడు. డేవిడ్‌ వార్నర్‌ జట్టు బాధ్యతను తీసుకున్నాడు. వన్‌డౌన్‌లో వచ్చిన స్టీవ్‌ స్మిత్‌, వార్నర్ కలిసి ఆస్ట్రేలియా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. డేవిడ్‌ వార్నర్‌ 52 బంతుల్లో 41 పరుగులు చేశాడు. ఇందులో 6 ఫోర్లు ఉన్నాయి. మరో ఎండ్ లో స్టీవ్‌ స్మిత్‌ రాణించాడు. 71 బంతులు ఎదుర్కొన్న స్మిత్ 46 పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు ఉన్నాయి. వీరిద్దరి భాగస్వామ్యంతో ఆసీస్ స్కోర్ బోర్డు ఫర్వాలేదనిపించింది.

జడేజా ఆసీస్ పతనాన్ని శాసించాడు. 27.1వ బంతికి స్మిత్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. 30వ ఓవర్లో లబుషేన్‌, అలెక్స్‌ కేరీ ని పెవిలియన్‌కు పంపించాడు. మిగతా బౌలర్లు సైతం వికెట్లు తీయకపోయినా పరుగులు ఇవ్వకుండా ఆస్ట్రేలియా ఆటగాళ్లపై ఒత్తిడి తీసుకొచ్చారు. 30 ఓవర్లు ముగిసే సరికి కంగారూలు 5 వికెట్లు నష్టపోయి 119 పరుగులు చేశారు. ఆ తర్వాత వచ్చిన ఒక్క బ్యాటర్ కూడా భారత బౌలర్ల ముందు నిలవలేకపోయారు. దీంతో 49.3 ఓవర్లకు పది వికెట్లు కోల్పోయి 199కి ఆలౌట్‌ అయింది రవీంద్ర జడేజా (3/28), జస్ప్రీత్‌ బుమ్రా (2/35), కుల్‌దీప్‌ యాదవ్‌ (2/42) సమష్టిగా కంగారూలను దెబ్బకొట్టారు.

Also Read: World Cup 2023: ప్రపంచ కప్ లో డేవిడ్ భాయ్ 1000 పరుగులు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 199
  • all out
  • australia
  • bowlers
  • IND vs AUS
  • india
  • world cup 2023

Related News

India summons Russia following the death of four Indians in an attack on a merchant vessel off the coast of Ukraine.

Ukraine: ఉక్రెయిన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిలో నలుగురు భారతీయుల మృతి చెందడంతో రష్యాకు భారత్ సమన్లు

రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య కొనసాగుతున్న ఘర్షణల నేపథ్యంలో ఈ దాడి జరిగింది. ఇటీవలి నెలల్లో ఒడెసా సమీపంలోని నల్ల సముద్ర నౌకా మార్గాలపై దాడులు పునరావృతమవుతున్నాయి. ఉక్రెయిన్ తీరంలో ఒక వాణిజ్య నౌకపై క్షిపణి దాడి జరిగి నలుగురు భారతీయులు మరణించిన మరుసటి రోజే, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) న్యూఢిల్లీలోని రష్యా ఛార్జ్ డి అఫైర్స్‌ను పిలిపించింది. గినియా-బిస్సావు జెండా కలిగి

  • Prime Minister's remarks on Rahul Gandhi at the start of the Parliament's Monsoon Session.

    Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా రాహుల్ గాంధీపై ప్రధాని వ్యాఖ్యలు

  • Balochistan has 'declared independence' from Pakistan.

    Balochistan: పాకిస్తాన్ నుండి బలూచిస్తాన్ ‘స్వాతంత్ర్యం ప్రకటించుకుంది’.. చైనా యొక్క 60 బిలియన్ డాలర్ల CPEC ప్రాజెక్టుకు అర్థం ఏమిటి?

Latest News

  • Nara Lokesh: కాకినాడలో NBK111 షూటింగ్‌లో గాయపడిన నందమూరి బాలకృష్ణను మంత్రి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శించార

  • Bahrain: కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు

  • Nandamuri Balakrishna: NBK111 షూటింగ్‌లో.. హీరో నందమూరి బాలకృష్ణ కు గాయాలు

  • PM Modi: నీట్ పేప‌ర్ లీక్‌పై తొలిసారి మాట్లాడిన ప్రధాని మోదీ.. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం

  • Tukaram Mundhe: తుకారం ముండే చేపట్టిన కఠిన చర్యలు ఫలిస్తున్నాయా? జలేబీ తన ప్రకాశవంతమైన ఆరెంజ్ కలర్ ను కోల్పోయిందంటూ వైరల్ పోస్ట్.

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd