BRS Minister: చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు నేను ఏడ్చాను: మంత్రి మల్లారెడ్డి
- By Balu J Published Date - 01:11 PM, Fri - 17 November 23
BRS Minister: ఎన్నికల ముంగిట చంద్రబాబు అరెస్టును బీఆర్ఎస్ పార్టీ క్యాష్ చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. అందుకే ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు వరుస సెట్టి చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నారు. ఇప్పిటికే వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ మాట్లాడాగా, తాజాగా మంత్రి మల్లారెడ్డి స్పందించారు. చంద్రబాబు నాయుడు బంగారం లాంటి మనిషి అని, చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు తాను ఏడ్చానని మంత్రి మల్లారెడ్డి చెప్పారు.
చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదన్నారు. ఏపీ దివాళా తీసిందని మల్లారెడ్డి ఆరోపించారు. తాను తెలుగుదేశం పార్టీలోనే కొనసాగాలనుకున్నానని, అయితే పరిస్థితులు పార్టీ మారేలా చేశాయన్నారు. 2014 పార్లమెంట్ ఎన్నికలో తెలంగాణలో తానొక్కడే టీడీపీ నుంచి గెలిచారని మల్లారెడ్డి గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి నన్ను బ్లాక్ మెయిల్ చేశాడు. రేవంత్ రెడ్డి ఇంత గొప్పోడు ఎలా అయ్యాడు. నన్ను రేవంత్ రెడ్డి ఎంతో ఇబ్బంది పెట్టాడు. టీడీపీలో ఉన్నప్పుడు ఎంపీ సీటు వదులుకో, లేకపోతే నీ కాలేజీలు బంద్ చేయిస్తా అని బెదిరించాడు.
ఎన్నికల అఫిడవిట్లో తప్పులుండొచ్చు.. వాటిని సరి చేసుకుంటా. చంద్రబాబును నా టాలెంట్‌తో ఇంప్రెస్ చేశా. చంద్రబాబును కలిసి మూడు టికెట్లు కావాలని అడిగా. నాలాంటి వాళ్లు కావాలని చంద్రబాబు రాజకీయాల్లో తీసుకున్నారు” అని మల్లారెడ్డి అన్నారు. అయితే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీఆర్ఎస్ నాయకులు చంద్రబాబు అరెస్టను ఖండిస్తున్నారని టీడీపీ అభిమానులు వాపోతున్నారు.
Related News
Rain Alert : మే 20 వరకు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు
గత 10 రోజులుగా రాష్ట్ర వ్యాప్తమగు చిరు జల్లులు పలకరిస్తూ చల్లపరుస్తూ వస్తున్నాయి. ఇక నిన్న గురువారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షం పడింది