KA Paul: తెలంగాణకు నేనే ముఖ్యమంత్రి కాబోతున్నా: కేఏ పాల్
తెలంగాణలో కేఏ పాల్ (KA Paul) నేనే తెలంగాణకు ముఖ్యమంత్రిని అంటూ రంగప్రవేశం చేశారు.
- Author : Gopichand
Date : 02-12-2023 - 7:50 IST
Published By : Hashtagu Telugu Desk
KA Paul: తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల వేడి నెలకొంది. ప్రధాన పార్టీలన్నీ తమదే విజయం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. నేతలు మాటలు, ఎగ్జిట్ పోల్స్ రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నారు. దీంతో అంతటా రేపు ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు..? ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే టెన్షన్ నెలకొంది. ఈ తరుణంలో తెలంగాణలో కేఏ పాల్ (KA Paul) నేనే తెలంగాణకు ముఖ్యమంత్రిని అంటూ రంగప్రవేశం చేశారు. తెలంగాణలో ప్రజాశాంతి పార్టీ బలమైన శక్తిగా రానుందని, బీఆర్‌ఎస్.. కాంగ్రెస్ కాదు ప్రజాశాంతి పార్టీనే ఫస్ట్ అంటూ పేర్కొన్నారు.
తెలంగాణకు నేనే ముఖ్యమంత్రి కాబోతున్నా – కేఏ పాల్ pic.twitter.com/V39qB9J00U
— Telugu Scribe (@TeluguScribe) December 2, 2023
Also Read: Telangana Election Results : కాంగ్రెస్ అభ్యర్థులకు రాహుల్ కీలక ఆదేశాలు
‘తెలంగాణ ఎన్నికల్లో మినమం 38 నుంచి 79 సీట్లను గెలుస్తున్నాం. క్యాండిడేట్లు అందరూ గెలుస్తున్నారు. ఛాలెంజ్ చేస్తున్నాను. ఎందుకు పునాదులు వేశాం ప్రతీ గ్రామంలో.. చర్చీలు ఉన్నాయి.టెంపుల్స్ ఉన్నాయి. మసీదులున్నాయి. కనుక అందరం కలిసి పోరాడితే సంపూర్ణ విజయం 112, 119లు వస్తాయి. లేదు అంటే 38 సీట్లు వచ్చినా నేనే మీకు ముఖ్యమంత్రిని. ఏ నేను సీఎం అయితే మంచిదా? వాళ్లు అయితే మంచిదా? ఒక డిబేట్ పెట్టండి.. ’ అంటూ కేఏ పాల్ సవాల్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేఏ పాల్ చేసిన ఈ ప్రకటన ఇప్పుడు అందరినీ షాక్ కు గురిచేసింది.
We’re now on WhatsApp. Click to Join.