Laila Rao Investment Fraud: లైలారావు’ నయా మోసం.. మహిళలే టార్గెట్
ఫేస్‌బుక్ పేజీ, టెలిగ్రామ్ ఖాతా ద్వారా 'లైలారావు' పేరుతో భారీ మోసాలకు పాల్పడుతుంది ఓ గ్యాంగ్. పలు ఫిర్యాదులపై హైదరాబాద్ పోలీసులు ఇష్యూని చాలా సీరియస్ గా తీసుకున్నారు.
- Author : Praveen Aluthuru
Date : 19-09-2023 - 5:32 IST
Published By : Hashtagu Telugu Desk
Laila Rao Investment Fraud: ఫేస్‌బుక్ పేజీ, టెలిగ్రామ్ ఖాతా ద్వారా ‘లైలారావు’ పేరుతో భారీ మోసాలకు పాల్పడుతుంది ఓ గ్యాంగ్. పలు ఫిర్యాదులపై హైదరాబాద్ పోలీసులు ఇష్యూని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఆన్‌లైన్ పెట్టుబడి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచించారు. చాలా మంది మధ్యతరగతి మహిళలను మోసగాళ్లు ప్రలోభపెట్టి, భారీ మొత్తంలో డబ్బును కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ స్కామ్ లో మహిళ పేరుతో ఫేస్‌బుక్‌లో ప్రచారం చేస్తున్నారు. లైలా రావు రోజువారీ కార్యకలాపాల వీడియోలను అప్‌లోడ్ చేస్తున్నారు. నేను పెట్టుబడిదారుడిని,గృహిణిని అని, మహిళలు పెట్టుబడి పెట్టడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చని, అలాంటి వారికీ నేను సహాయం చేస్తానని చెప్పి మహిళలను టార్గెట్ చేస్తుందీ గ్యాంగ్. టెలిగ్రామ్‌లో “లైలా సూపర్”, “లైలా – ఉర్ ఇన్వెస్ట్‌మెంట్ గైడ్”, “లైలా రావు బెస్ట్” మరియు అనేక ఇతర ఛానెల్‌లను కూడా నడుపుతున్నారు. పెట్టుబడి మోసం గురించి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఫిర్యాదులు నమోదయ్యాయి. మోసగాళ్లు వివిధ రాష్ట్రాల నుంచి ఏకకాలంలో కార్యకలాపాలు సాగిస్తున్నారు అని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.
Also Read: Aditya-L1 Mission: మరో గుడ్ న్యూస్ చెప్పిన ఇస్రో.. సూర్యుడి దిశగా ఆదిత్య L1?