Hyderabad Formula Racing: హైదరాబాద్లో ఫార్ములా రేసింగ్ రయ్ రయ్!
హైదరాబాద్లో నిర్వహిస్తున్న ఇండియన్ రేసింగ్ లీగ్లో భాగంగా ఫార్ములా కార్లు వాయువేగంతో దూసుకెళ్లాయి.
- By Balu J Published Date - 05:04 PM, Sat - 19 November 22
హైదరాబాద్లో నిర్వహిస్తున్న ఇండియన్ రేసింగ్ లీగ్లో భాగంగా ఫార్ములా కార్లు వాయువేగంతో దూసుకెళ్లాయి. ఇండియన్ రేసింగ్ లీగ్ అట్టహసంగా ప్రారంభమైంది. హుస్సేన్ సాగర్ వద్ద ఇండియన్ రేసింగ్ లీగ్ నిర్వహిస్తున్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఫార్ములా-E రేసు హైదరాబాద్ లో జరుగుతోంది. రేసింగ్ ట్రాక్ ను సుందరంగా తీర్చిదిద్దండంతో పాటు వేలాది మంది ప్రేక్షకులు కూర్చునేలా గ్యాలరీలు ఏర్పాటుచేశారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకూ ఈ రేసింగ్ జరుగుతోంది.
6 బృందాలుగా మొత్తం 24 మంది రేసర్లు ఈ రేసింగ్ పాల్గొంటున్నారు. ఈ రేసింగ్ లో సగం మంది రేసర్లు మన దేశానికి చెందిన వారుకాగా, మరో సగం మంది విదేశాలకు చెందినవారు. రేసింగ్ పోటీలో హైదరాబాద్ రేసర్లు కూడా పాల్గొంటున్నారు. ఐమాక్స్ ఇందిరా గాంధీ విగ్రహం వద్ద నుంచి ఎన్టీఆర్ మార్గ్, లుంబినీ పార్క్, ఎన్టీఆర్ పార్క్ , ఐమ్యాక్స్ వరకూ రేస్ సర్య్కూట్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ వేదికగా మొదటి సారి రేసింగ్ కార్ల పోటీలు నిర్వహిస్తున్నారు.
ఈ రేసింగ్ లీగ్ లో 250 కిలోమీటర్ల వేగంతో రేసింగ్ కార్లు దూసుకుపోతున్నాయి. తెలుగు తల్లి ఫ్లై ఓవర్ సచివాలయం, ప్రసాద్ ఐ మాక్స్ ఇందిరాగాంధీ విగ్రహం, లుంబినీ పార్క్ మీదుగా తిరిగి తెలుగుతల్లి ఫ్లై ఓవర్ చేరుకుంటున్నాయి రేసింగ్ కార్లు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫార్ములా-ఈ రేసింగ్ కు HMDA పూర్తి ఏర్పాట్లు చేసింది. రేసింగ్ లీగ్ కోసం 2.7 KM స్ట్రీట్ సర్క్యూట్ ఏర్పాటు చేసింది. మొత్తం 6 టీమ్ ల మధ్య రేసింగ్ లీగ్ జరుగుతుంది. మొదటి, తుది రేసింగ్ పోటీలకు వేదికగా హైదరాబాద్ ను ఎంపిక చేశారు. ఇండియన్ రేసింగ్ లీగ్ ను RPPL సంస్థ నిర్వహిస్తుంది.
Related News
Rains : భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను అలర్ట్ చేసిన సీఎం రేవంత్
తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగిన ఆవర్తనం కారణంగా తెలంగాణ ఐదు రోజుల పాటు కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది