Ganesh Immersion: ఇంట్లోనే వినాయకుడి నిమజ్జనం చేసిన సీవీ ఆనంద్
నేటితో గణేష్ ఉత్సవాలు ముగిశాయి. 11 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుడు తల్లి గంగమ్మ ఒడికి చేరాడు. ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా మిగిలిన గణనాథులు కూడా గంగమ్మ చెంతకు చేరనున్నాయి.
- Author : Praveen Aluthuru
Date : 28-09-2023 - 2:25 IST
Published By : Hashtagu Telugu Desk
Ganesh Immersion: నేటితో గణేష్ ఉత్సవాలు ముగిశాయి. 11 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుడు తల్లి గంగమ్మ ఒడికి చేరాడు. ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా మిగిలిన గణనాథులు కూడా గంగమ్మ చెంతకు చేరనున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కూడా వాళ్ళ ఇంట్లో గణపతిని నిమజ్జనం చేశారు. అయితే సీవీ ఆనంద్ తన ఇంట్లోనే గణేశుడి నిమజ్జనం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. పర్యావరణ పరిరక్షణను కాపాడటం కోసం మట్టితో చేసిన గణపతి విగ్రహాలను ప్రతిష్టించాలను ప్రభుత్వం ముందు నుంచి చెప్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే సీవీ ఆనంద్ ఇంట్లో మట్టితో చేసిన గణపతిని ప్రతిష్టించారు.
హుస్సేన్‌సాగర్‌లో గణనాథుని నిమజ్జనం పూర్తయింది. ఎటువంటి సమస్యలు తలెత్తకుండా తెలంగాణ ప్రభుత్వం 40 వేల మంది పోలీసుల పటిష్ట భద్రతతో సక్సెస్ ఫుల్ గా నిమజ్జన ఏర్పాట్లు చేశారు. మొత్తానికి ఖైరతాబాద్ మహా గణపతి గంగమ్మ ఒడికి చేరాడు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన గణేశ్ శోభాయాత్ర మధ్యాహ్న సమయానికి ట్యాంక్ బండ్ కు చేరింది.మహా గణపతితో సహా మిగతా వేలాది గణేష్ నిమజ్జనాలు ఇంకా కొనసాగుతున్నాయి.
Did Ganesh visarjan of our clay idol at home as under 👇👇. Then in the clay collected in the pot , my wife planted a tree 🌳 .
This helps in keeping the environment clean too and adds to the tree cover . pic.twitter.com/MP48CR7e2r
— CV Anand IPS (@CVAnandIPS) September 28, 2023
Also Read: Ganpati Bappa Morya : గంగమ్మ ఒడికి చేరిన మహా గణపతి