HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Husband Cuts Wife Throat In Odisha

Odisha Crime News: భార్య తల, మొండం వేరు చేసిన కసాయి భర్త

భార్య తల మొండం వేరు చేశాడు కిరాతక భర్త. ఒడిశాలోని గజపతి జిల్లాలో ఓ వ్యక్తి తన భార్యను హతమార్చి, తల నరికి పొలాల్లో పడేశాడు. ఈ దారుణమైన సంఘటన ఒడిశాలోని గజపతి జిల్లా కాశీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది.

  • Author : Praveen Aluthuru Date : 25-05-2023 - 8:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Odisha Crime News
New Web Story Copy 2023 05 25t200414.800

Odisha Crime News: భార్య తల మొండం వేరు చేశాడు కసాయి భర్త. ఒడిశాలోని గజపతి జిల్లాలో ఓ వ్యక్తి తన భార్యను హతమార్చి, తల నరికి పొలాల్లో పడేశాడు. ఈ దారుణమైన సంఘటన ఒడిశాలోని గజపతి జిల్లా కాశీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. మృతురాలిని ఊర్మిళా కర్జీగా, నిందితుడు భర్త చంద్రశేఖర్ కర్జీ అలియాస్ మున్నాగా గుర్తించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం చంద్రశేఖర్ ఉదయం తన భార్యతో కలిసి పొలానికి వెళ్లాడు, అక్కడ ఏదో విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.దీంతో తాళి కట్టిన భర్త భార్యను కడతేర్చాడు. పొలాల్లో నుంచి భార్య తలతో తిరిగి వస్తున్న మున్నాను చూసి గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. ఇంటికి చేరుకోగానే తలను తన ఇంటి తలుపు ముందు ఉంచాడు. దీంతో భయాందోళనకు గురైన గ్రామస్తులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చూడగా, తెగిపడిన తల దగ్గర మున్నా నిశ్శబ్దంగా కూర్చున్నట్లు గుర్తించారు. పోలీసుల విచారణలో తన భార్యను హత్య చేసి ఛిద్రం చేశానని ఆ వ్యక్తి అంగీకరించాడు.మృతదేహాన్ని పొలంలో వదిలేసి తలను మాత్రమే ఇంటికి తీసుకొచ్చినట్లు తెలిపాడు. నిందితుడు నేరం అంగీకరించడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు భర్తను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు మృతదేహాన్ని, తలను సేకరించి పోస్టుమార్టంకు తరలించారు. అయితే ఈ దారుణ హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. స్థానికుల సమాచారం ప్రకారం చంద్రశేఖర్‌కు ఊర్మిళ రెండో భార్య అని, వీరికి రెండేళ్ల పాప ఉంది. చంద్రశేఖర్ మొదటి భార్యపై కూడా క్రూరత్వం ప్రదర్శించడంతో కొన్నాళ్ల క్రితం అతడిని వదిలి వెళ్లిపోయిందని స్థానికులు చెబుతున్నారు.

Read More: Nara Lokesh : లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర‌కు బ్రేక్‌.. మ‌ళ్లీ ప్రారంభం ఎప్పుడంటే..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • crime news
  • Gajapati District
  • husband
  • Kasinagar
  • odisha
  • throat
  • wife

Related News

Indore Mba Student

ఇండోర్‌లో ఎంబీఏ విద్యార్థిని దారుణ హత్య

Piyush Dhamnodia  మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరాన్ని ఒక భయంకరమైన హత్యోదంతం ఉలిక్కిపడేలా చేసింది. ఉన్నత చదువులు చదువుతున్న ఒక ఎంబీఏ విద్యార్థిని, తన క్లాస్‌మేట్ చేతిలోనే దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో వెలుగుచూసిన అంశాలు ప్రేమ పేరుతో సాగే వికృత చేష్టలకు అద్దం పడుతున్నాయి. మంగళవారం బర్త్‌డే పార్టీ కని చెప్పి వెళ్లిన 24 ఏళ్ల యువతి, శుక్రవారం నాడు తన ప్రియుడు పీయూష్ ధనోటియా ఉంటున్న అద్

  • 33-Year-Old Killed By Married Lover

    ప్రేమికుల రోజు విషాదం..సెప్టిక్ ట్యాంక్‌లో ప్రియురాలిని చంపి పూడ్చేసిన ప్రియుడు

Latest News

  • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

  • అవయవ దానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు?

  • ఈ ఏడాదిలో కారు కొన‌టానికి ఇదే మంచి స‌మ‌య‌మా?!

  • ల‌వ‌ర్‌తో రొమాంటిక్ ఫొటోను షేర్ చేసిన పాండ్యా!

  • మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ట్రంప్‌!

Trending News

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd