Hyderabad : హైదరాబాద్‌లో భారీగా నిషేధిత సిగరేట్లు స్వాధీనం
హైదరాబాద్ నగరంలో నిషేధిత సిగరెట్లను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను వెస్ట్‌జోన్ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ బృందం పట్టుకుంది.
- By Prasad Published Date - 08:08 AM, Sat - 8 July 23

హైదరాబాద్ నగరంలో నిషేధిత సిగరెట్లను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను వెస్ట్‌జోన్ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ బృందం పట్టుకుంది. వారి వద్ద నుంచి 32.50 లక్షల రూపాయల విలువైన నిషేధిత సిగరెట్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. మజీరుద్దీన్ జావీద్ ఆదేశాల మేరకు హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లోని వీఆర్‌ఎల్ లాజిస్టిక్ లిమిటెడ్ ట్రాన్స్‌పోర్ట్, సైబరాబాద్‌లోని కాటేదాన్, మైలార్‌దేవ్‌పల్లి వీఆర్‌ఎల్ లాజిస్టిక్ లిమిటెడ్ ట్రాన్స్‌పోర్ట్ ప్రాంగణంలో నేనావత్ శ్రీరామ్, జీ వెంకట్రమణ అనే ఇద్దరు నిందితులు నిషేధిత సిగరెట్లను రవాణా చేస్తున్నారు. దీని ద్వారా అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారని పోలీసులు తెలిపారు. పట్టుబడిన నిందితులను తదుపరి విచారణ నిమిత్తం హైదరాబాద్‌లోని ఎస్‌హెచ్‌ఓ, అబిడ్స్ పీఎస్, సైబరాబాద్, మైలార్‌దేవ్‌పల్లి పీఎస్‌లకు తరలించారు. నిషేధిత సిగరెట్లను అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి హైదరాబాద్‌లో అత్యధిక ధరకు విక్రయించేవారని పోలీసులు తెలిపారు