Periods: భరించలేని నెలసరి సమస్యలా.? ఈ చిట్కాలు ఫాలో అవ్వండి…!
అమ్మాయిలకు ప్రతి నెలసరి అగ్నిపరీక్ష లాంటిది. ఆ సమయంలో వచ్చే కడుపు నొప్పి, వాంతులు, కళ్లు తిరగడం, నడుం నొప్పి,నీరసం, చికాకు, తిమ్మిర్లు, అధిక రక్తస్రావం..
- By Hashtag U Published Date - 11:58 AM, Sat - 19 February 22

Period Pain Relief: అమ్మాయిలకు ప్రతి నెలసరి అగ్నిపరీక్ష లాంటిది. ఆ సమయంలో వచ్చే కడుపు నొప్పి, వాంతులు, కళ్లు తిరగడం, నడుం నొప్పి,నీరసం, చికాకు, తిమ్మిర్లు, అధిక రక్తస్రావం..ఇలా ఒక్కటేంటి ఎన్నో తీవ్ర పరిస్థితులను ఎదుర్కోవల్సిందే. అయితే ఈ లక్షణాలన్నీకూడా అందరి విషయంలో ఒకేవిధంగా ఉండవు. కొందరికి నెలసరి మొదలయ్యే ముందు కనిపిస్తే…ఇంకొందరికి రుతుస్రావ సమయంలో ఇబ్బంది కలిగిస్తాయి. నొప్పి తీవ్రత కూడా కొందరిలో విపరీతంగా ఉంటే…మరికొందరిలో స్వల్పంగా ఉంటుంది. అయితే ఇంకొందరిలో మాత్రం ఎలాంటి లక్షణాలు ఉండవు. ఏదిఏమైనా ఇవి అతివల దైనందిన జీవితంలోకానీ వ్రుత్తిపరంగా, వ్యక్తిగత పనులపై చాలా ప్రభావాన్నే చూపిస్తాయి.
కొంతమందిలో బుుతుస్రావం అయిన ఆరు నెలల నుంచి సంవత్సరం పాటు బుుతు తిమ్మరిని గమనించవచ్చు. మొదటికొన్ని నెలలు పీరియడ్స్ సాధారణంగా నొప్పిలేకుండా వస్తాయి. ఎందుకంటే పీరియడ్స్ అనోవ్లేటరీగా ఉంటాయి. పిట్యూటరీ అండాశయ అక్షం పరిపక్వం చెందడం, అండోత్సరంగా మారడం వల్ల పీరియడ్స్ కు ముందు ఇలాంటి సమస్యలు వస్తుంటాయి.
రుతుక్రమంలో వచ్చే నొప్పిని రోజువారీ దినచర్యను ప్రభావితం చేస్తుంది. కానీ మహిళలు వీటన్నింటిని పట్టించుకోరు. పీరియడ్స్ లోనొప్పిని సాధారణ అంశంగానే పరిగణిస్తారు. కానీ పీరియడ్స్ లో వచ్చే నొప్పిని అశ్రద్ధ చేయవద్దంటున్నారు గైనకాలజిస్టులు. అశ్రద్ధ చేసినట్లయితే పెల్విన్ ఇన్ఫెక్షన్లు, అడైనోమైయోసిస్, ఎండో మెట్రియోసిస్, యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ వంటి వ్యాధులకు కారణం అవుతాయని హెచ్చరిస్తున్నారు.
నొప్పిని తగ్గించడం ఎలా…?
ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల పీరియడ్స్ లో వచ్చే నొప్పి తీవ్రతను తగ్గించుకోవచ్చు. దినం తప్పకుండా వాగింగ్ చేయడం వల్ల కటి కండరాలు యాక్టివ్ గా మారుతాయి. దీంతో బుుతుతిమ్మిరితో సంబంధం ఉన్న నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాదు వెన్నుపూసను బలపరుస్తాయి.
నెలసరిలో వచ్చే నొప్పిని తగ్గించేందుకు వైద్యనిపుణులు కొన్ని యోగా ఆసనాలను సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.
* బద్దకోనాసన లేదా సీతాకోకచిలుక ఆసనం: ఈ భంగిమలో ఆసనాలు చేస్తే రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. అండాశయాల పనితీరును ప్రేరేపిస్తుంది.
*చంద్ర నమస్కారం: ఈ ఆసనం ఉదర మరియు కటి కండరాలను బలంగా ఉంచుతుంది.
*వజ్రాసనం లైదా డైమండ్ భంగిమ: ఈ ఆసనం నడుము మరియు తుంటి ప్రాంతాన్ని సడలించడంలో సహాయపడుతుంది. అంతేకాదు బుుతుతిమ్మిరి నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.
*సుప్త బద్దకోనాసన : ఈ ఆసనం పీరియడ్స్ లో వచ్చే నొప్పిని తగ్గిస్తుంది. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను నివారిస్తుంది.
కేవలం యోగా ఒక్కటే కాదు…నొప్పిని తగ్గించే విషయంలో ఏ రకమైన వ్యాయామం అయినా సరే చాలా ఉపయోగంగా ఉంటుంది. వ్యాయామంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా అరటి, నిమ్మ, నారింజ, పుచ్చకాయ వంటి పండ్లు నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. ఇవే కాదు మాంగనీస్ పుష్కలంగా లభించే వాల్ నట్స్, బాదం, గుమ్మడి గింజలు తరుచుగా తీసుకోవాలి. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. సోంపుగింజల నీరు, చమోమిలే టీ కూడా నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.
రుతుచక్రానికి ముందు ఉప్పు, కెఫిన్, చాక్లెట్స్, చక్కెరకు బదులుగా తాజా పండ్లు, కూరగాయాలు, మంచినీళ్లు ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈసమయంలో శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడం చాలా అవసరమని చెబుతున్నారు. కనీసం ఆరు గ్లాసుల మంచినీళ్లు తీసుకోవాలి. లెట్యూస్, క్యాబేజీ, సెలెరీ, ఆకుకూరలు, దోసకాయ, పుచ్చకాయ, వంటి వాటిలోనీరు పుష్కలంగా ఉంటుంది. అందుకే ఈ పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల మీ శరీరానికి అవసరమైన నీరు అందుతుంది.