HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >How Food Affects Your Mood

Anger Management: మీకు కోపం ఎక్కువా.? వీటి జోలికి అస్సలు వెళ్లకండి…!

కొందరికి ముక్కుమీద కోపం ఉంటుంది. ప్రతిచిన్న విషయానికి కోపం టన్నుల కొద్ది తన్నుకొస్తుంటుంది. ఎప్పుడూ చికాకుగా ఉంటారు.

  • Author : Hashtag U Date : 16-02-2022 - 10:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
food
food

కొందరికి ముక్కుమీద కోపం ఉంటుంది. ప్రతిచిన్న విషయానికి కోపం టన్నుల కొద్ది తన్నుకొస్తుంటుంది. ఎప్పుడూ చికాకుగా ఉంటారు. ఇతరులపై అరుస్తూ గోళ చేస్తారు. వాస్తవానికి అలాంటివారు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలని కోరకుంటారు. కానీ ఉండలేరు..ఎందుకంటే కోపం వారి ప్రశాంతతను పాడుచేస్తుంది. అందుకే కోపంతో ఊగిపోతుంటారు.

ఇదే విషయంపై కాలిఫోర్నియా యూనివర్సిటీలో పరిశోధనలు జరిపారు. ఈ పరిశోధనల్లో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. మనం తీసుకునే ఆహారానికి, కోపానికి సంబంధం ఉందా అనే విషయంపై పరిశోధనలు చేశారు. అది నిజమే అని తేలింది. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారమే మన కోపానికి కారణమని పరిశోధకులు తేల్చి చెప్పారు. అందుకే కోపాన్ని పెంచు ఫుడ్స్ కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. అంతేకాదు కోపాన్ని తగ్గించే ఆహారాలన క్రమం తప్పకుండా తీసుకుంటే మంచిదని చెబుతున్నారు. ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే కోపం కంట్రోల్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇలాంటి ఫుడ్స్ తినకూడదు…
బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ అస్సలు తినకూడదు. ఎందుకంటే ఇవి తింటే కోపం పెరుగుతుంది. చిప్స్ , నూడుల్స్, చైనీస్ ఫ్రైడ్ రైస్, జంక్ ఫుడ్, కేకులు, తరచుగా తినేవారికి విపరీతమైన కోపం వస్తుందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. అంతేకాదు ఈ ఫుడ్స్ తినేవారు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేరట.

షుగర్ కు దూరంగా ఉండాలి…
షుగర్ ఎక్కువగా ఉండే స్వీట్లకు దూరంగా ఉండాలని పరిశోధకులు సూచిస్తున్నారు. వీటిని తినట్లయితే మనలో ఉండే కోపం తీవ్రస్ధాయికి చేరుకుంటుంది. విసుగు, ,చికాకు వంటివి వస్తాయి. కాబట్టి వీటన్నింటికి దూరంగా ఉండటం మంచిది.

ఏ ఫుడ్స్ తీసుకోవాలి….
కోపాన్ని నియంత్రించడంలో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు బాగా ఉపయోగపడతాయని పరిశోధకులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ కూడా మన కోపాన్ని కంట్రోల్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. చేపలలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. అంతేకాదు వీటిలో మంచి కొలెస్ట్రాల్ కూడా మెండుగా ఉంటుంది. గుడ్లు, బాదం, వాల్ నట్స్ లలో కూడా కోపాన్ని తగ్గించే గుణాలుంటాయి. వీటిల్లో ఉండే షోషకాలు కోపాన్ని తగ్గించేందుకు సహాయపడతాయి.

ఇక మన శరీరంలో ఉండే డోపమైన్ అనే హార్మోన్ కోపాన్ని తగ్గిస్తుంది. ఈ హార్మోన్ను పెరిగేందుకు పుట్టగొడుగులు, చికెన్, చేపలు, గుడ్లు సహాయపడతాయి. కానీ వీటన్నింటిని కూడా మోతాదులోనే తీసుకోవడం మంచిది. ఇక గుమ్మడి గింజలు, పాలకూర, పొద్దుతిరుగుడు గింజలు కోపాన్ని నియంత్రిస్తాయిని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • anger
  • anger management
  • food affects
  • nutrition
  • university of california

Related News

Anger and irritability... which vitamin deficiency causes them?

Vitamin Deficiency: కోపం, చిరాకు.. ఏ విటమిన్ లోపం వల్ల వస్తాయి?

Vitamin Deficiency: కోపం రావడం అనేది సహజం. కానీ ఎవరైనా అకస్మాత్తుగా చాలా చిరాకుగా, కోపంగా ప్రవర్తించడం ప్రారంభిస్తే వారి శరీరంలో ఏదైనా విటమిన్ లోపం (Vitamin Deficiency) ఉండవచ్చు. కోపం అనేది మనల్ని ఎప్పుడైనా ఇబ్బందుల్లోకి నెట్టే విషయం, ఎందుకంటే ఆ సమయంలో ప్రజలు తాము సరైన పని చేస్తున్నారో లేదో కూడా అర్థం చేసుకోలేని మానసిక స్థితిలో ఉంటారు. వారికి తమకే అన్యాయం జరుగుతున్న విషయం కూడా తెలియకపోవచ్చు. క

    Latest News

    • IMT : హైదరాబాద్‌లో ‘అభ్యుదయ 2026’ ముగింపు

    • MK Stalin: విజయ్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది.. ఎన్నికలకు సిద్ధంగా ఉండండి: స్టాలిన్

    • Amazon: అమెజాన్ ప్రైమ్ డే జులై 4 నుంచి ఆఫర్ల సునామీ

    • RAPO 23: హీరోగా, దర్శకుడిగా రామ్ పోతినేని కొత్త సినిమా ఓపెనింగ్

    • Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రికులకు గుడ్ న్యూస్.. ఆధ్యాత్మిక సాహస యాత్రకు సిద్ధమా?

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd