Tirupathi : తిరుపతిలో విషాదం.. విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం చూసి హాస్టల్ వార్డెన్ మృతి
తిరుపతి జిల్లాలో విషాదం చోటచేసుకుంది. ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని హాస్టల్‌లో ఆత్మహత్యకు పాల్పడగా, సంఘటనా స్థలానికి
- Author : Prasad
Date : 05-02-2023 - 12:58 IST
Published By : Hashtagu Telugu Desk
తిరుపతి జిల్లాలో విషాదం చోటచేసుకుంది. ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని హాస్టల్‌లో ఆత్మహత్యకు పాల్పడగా, సంఘటనా స్థలానికి చేరుకుని వార్డెన్ షాక్‌కు గురై మృతి చెందాడు. గూడూరులోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి దహరణేశ్వర రెడ్డి(20) శనివారం కళాశాల హాస్టల్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన అతను.. సీఎస్ఈ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. విషయం తెలుసుకున్న హాస్టల్ వార్డెన్ బి.శ్రీనివాసులు నాయుడు, కళాశాల ప్రిన్సిపాల్, ఇతర సిబ్బంది విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన స్థలానికి చేరుకున్నారు. శ్రీనివాసులు నాయుడు(54) విద్యార్థిని ఉరివేసుకుని ఉండడం చూసి.. ఒక్కసారిగా కుప్పకూలిపోయిడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు. వార్డెన్‌కు గుండెపోటు వచ్చి పడిపోయినట్లు ప్రాథమిక సమాచారం. విద్యార్థి ఆత్మహత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.