Taneti Vanitha: అమలాపురం అదుపులో ఉంది!
అమలాపురం ఘటన, అనంతర పరిస్థితులపై డీజీపీతో సమీక్షించినట్లు ఏపీ హోంమంత్రి తానేటి వనిత తెలిపారు.
- By Balu J Published Date - 07:51 PM, Wed - 25 May 22
అమలాపురం ఘటన, అనంతర పరిస్థితులపై డీజీపీతో సమీక్షించినట్లు ఏపీ హోంమంత్రి తానేటి వనిత తెలిపారు. ఆందోళనలు జరగకుండా అమలాపురానికి అదనపు బలగాలను పంపామని.. అక్కడి పరిస్థితులు ప్రస్తుతం పూర్తిగా అదుపులోనే ఉన్నాయని చెప్పారు. గతంలో ఏడుకు పైగా కేసులున్న 72 మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని.. వారిలో 46 మందిని అరెస్ట్ చేశామన్నారు. మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లపై దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఆందోళకారులు దాడి చేస్తున్నా సంయమనం పాటించారంటూ పోలీసులను హోంమంత్రి అభినందించారు.
కాగా… కోనసీమలోని అల్లర్లు జరగడానికి ముఖ్య కారణం YSR కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే కారణమని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ పేర్కొన్నారు. విజయవాడ పాత బస్తీలోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. YSR కాంగ్రెస్ పార్టీ MLC అనంతబాబు చేసిన హత్య కేసు నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే కోనసీమలో ఘర్షణలు సృష్టించారన్నారు. YCP నేతలు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తే సహించేదిలేదని స్పష్టం చేశారు.