School Holidays : ఆగస్టు నెలలో స్కూల్స్ కు ఏకంగా 9 రోజులు సెలవులు
సెలవుల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. మరికొద్ది గంటల్లో ఆగస్టు నెల ప్రారంభం కాబోతుంది
- By Sudheer Published Date - 06:10 PM, Tue - 30 July 24

హాలీడే (Holidays ) అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి..వారమంతా పని చేసి ఒక్క రోజైన రెస్ట్ తీసుకోవాలని భావిస్తారు. ఇక స్కూల్ (Schools) , కాలేజ్ (Colleges) విద్యార్థులైతే సెలవులు వస్తున్నాయంటే చాలు వారి ఆనందానికి అవధులు ఉండవు..హ్యాపీ గా ఫ్రెండ్స్ తో ఆటలు ఆడుకోవచ్చు..ఇంట్లో అమ్మచేతి వంట తినొచ్చు..సినిమాలకు , షికార్లకు వెళ్లొచ్చు..ఇలా ఎన్నో ప్లాన్లు చేసుకుంటుంటారు. అలాంటి సెలవుల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. మరికొద్ది గంటల్లో ఆగస్టు (Holidays in August 2024) నెల ప్రారంభం కాబోతుంది. ఈ నెలలో ఒకటి రెండు కాదు ఏకంగా 09 రోజులు సెలవులు రాబోతున్నాయి. రెండవ శనివారం, స్వాతంత్య్ర దినోత్సవం ఇలా పలు పండగలు, ఆదివారాలు అన్నీ కలిపి మొత్తం 9 రోజులు సెలవులు ఉన్నాయి. మరి ఏ ఏ రోజులు సెలవులు ఉన్నాయో చూస్తే పోలె..
We’re now on WhatsApp. Click to Join.
ఏపీ అకడమిక్ ఇయర్ 2024-25 ప్రకారం మొత్తం 232 పని దినాలు కాగా 83 రోజులు సెలవులు వచ్చాయి. ఆగస్టు నెలలో 31 రోజులకు గాను 24 పని దినాలు ఉన్నాయి. అంటే 7 రోజులు సెలవులు. అయితే వరలక్ష్మి వ్రతం, రాఖీ పూర్ణిమ కారణంగా మరో రెండు రోజులు సెలవులు ఉండనున్నాయి. ఆగస్టు 4న ఆదివారం నాడు, ఆగస్టు 10న రెండవ శనివారం, ఆగస్టు 11న ఆదివారం, ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం నాడు, ఆగస్టు 16న శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం, ఆగస్టు 18న ఆదివారం, ఆగస్టు 19న రాఖీ పూర్ణిమ/శ్రావణ పూర్ణిమ, ఆగస్టు 25న ఆదివారం, ఆగస్టు 26 సోమవారం నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సెలవులు ఉన్నాయి. మొత్తం ఆగస్టు నెలలో పాఠశాలలకు 9 రోజులు సెలవులు రాబోతున్నాయి. ఇటు తెలంగాణలో కూడా 9 రోజులు సెలవులు ఉన్నాయి. ఇంకేంటి విద్యార్థులకే కాదు తల్లిదండ్రులకు కూడా కాస్త రిలాక్స్ అవ్వొచ్చు.
Read Also : Kamika Ekadashi : మనసులోని కోర్కెలు తీరాలా ? రేపు కామిక ఏకాదశి పూజలు చేయండి