High Court: కరోనా దృష్ట్యా పిల్లలకు వైద్య సదుపాయాలు పెంచాలి
- By hashtagu Published Date - 02:12 PM, Fri - 7 January 22
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పిల్లల కోసం వైద్య సదుపాయాలు మరింత పెంచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు పెంచాలని ఆదేశించిన హైకోర్టు.. కేంద్రం మార్గదర్శకాలు కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. జనం గుమిగూడకుండా నియంత్రించాలని.. మాల్స్, థియేటర్లలో కొవిడ్ నిబంధనలు అమలు చేయాలని ఆదేశించింది. కరోనాపై తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.