HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Heavy Rains In Warangal

Warangal: వర్షాల కారణంగా కాజీపేట రైల్వే స్టేషన్ లోకి భారీగా వరద నీరు?

భారతదేశవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. గంగా యమునా లాంటి భారీ నదులు పొంగిపొర్లడంతో పాటు ప్రమాదకర స

  • Author : Anshu Date : 27-07-2023 - 4:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Warangal
Warangal

భారతదేశవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. గంగా యమునా లాంటి భారీ నదులు పొంగిపొర్లడంతో పాటు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. దీంతో ఇప్పటికే అధికారులు లోతట్టు ప్రాంతాలలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పుడు గోదావరి నది కూడా చాలా ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దాంతో నదులు కూడా ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ముఖ్యంగా ఉత్తరాఖండ్ లాంటి ఎగువ ప్రదేశాల్లో భారీగా వర్షాలు కురుస్తుండటం వల్ల ఆ వరద నీరు మొత్తం నదులలో చేయడంతో ప్రస్తుతం గంగా యమునా గోదావరి నదులు ఉదృతంగా వ్యవహరిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే భారీ వర్షాల కారణంగా తాజాగా వరంగల్ నగరం మొత్తం అతలాకుతలమయ్యింది. ముఖ్యంగా వరంగల్ లోని భద్రకాళి ఆలయం వద్ద అయ్యప్ప స్వామి గుడిలోకి భారీగా వరద నీరు పోటెత్తింది. దాంతో పాటుగా కాజీపేట రైల్వే స్టేషన్ వరంగల్ బట్టల బజార్ తదితర ప్రాంతాలు మొత్తం వర్షపు నీటితో నీట మునిగాయి. అదేవిధంగా హనుమకొండ వరంగల్ రహదారి వంతెన పై నుంచి వరద నీరు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి.

వరంగల్ అండర్ రైల్వే బ్రిడ్జి కింద వరద నీరు నిలిచింది. వరంగల్‌ – ఖమ్మం జాతీయ రహదారి జలదిగ్బంధమవ్వగా, పంతిని వద్ద ఊర చెరువు ఉప్పొంగడంతో రోడ్డుపై వరద ప్రవహిస్తోంది. మైలారం వద్ద భారీ చెట్టు కూలి అధిక సంఖ్యలో వాహనాలు నిలిచాయి. మరో రెండు రోజులు జిల్లా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించడంతో.. అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. మొత్తానికి దేశవ్యాప్తంగా కురుస్తున్న ఈ భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడంతో పాటు వందల సంఖ్యలో గ్రామాలు నీట మునుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే వరద నీటి ప్రవాహం వర్షాలు ఇంకా ఎక్కువ అయ్యేలా ఉన్నాయి తప్ప తగ్గడం లేదు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • floods
  • full rains
  • kajipet railway station
  • warangal
  • Warangal rains

Related News

Pawan Kalyan's tour in Telangana... Janasena chief to fulfill a young child's last wish.

Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో కాంగ్రెస్, జనసేన మధ్య నెలకొన్న వివాదం చల్లారడం లేదు. ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వంపై, కాంగ్రెస్ పార్టీపై పవన్ కళ్యాణ్, జనసేన నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తుండగా.. వాటికి కాంగ్రెస్ నేతలు కూడా అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో ఈ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి నె

    Latest News

    • YOGA : ఆర్టీసీ హౌస్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

    • Rains : వారం రోజుల పాటు తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ

    • Jnaneswari: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ఎన్నో కొత్త మలుపు.?

    • Wedding : జర్మనీలో మొదలైన ప్రేమ.. పల్నాడులో పెళ్లి పీటలు

    • Happy Fathers Day: నాన్నకు ప్రేమతో…

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd