Heavy Rains : తమిళనాడులో భారీ వర్షాలు.. 23 జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు
తమిళపాడులో భారీ వర్షాలు కురుస్తున్నారు. వాతావరణ శాఖ సూచనల కారణంగా తమిళనాడులో భారీ వర్షాలకు సెలవులు..
- By Prasad Published Date - 08:53 AM, Sat - 12 November 22

తమిళపాడులో భారీ వర్షాలు కురుస్తున్నారు. వాతావరణ శాఖ సూచనల కారణంగా తమిళనాడులో భారీ వర్షాలకు సెలవులు ప్రకటించారు. భారత వాతావరణ శాఖ, ప్రాంతీయ వాతావరణ శాఖ భారీ వర్షపాత అంచనాల కారణంగా చెన్నై, ఇతర 22 జిల్లాల్లోని అన్ని పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అన్ని పాఠశాలలు, కళాశాలలకు నిన్న అర్థరాత్రి సెలవు ప్రకటించారు. చెన్నై, కాంచీపురం, రాణిపేట్, వెల్లూరు, తిరువళ్లూరు, విల్లుపురం, తిరువారూర్, మైలాడుతురై, నీలగిరిలలోని పాఠశాలలు, కళాశాలలకు నవంబర్ 12 న సెలవు ప్రకటించారు. నీలగిరి, కోయంబత్తూరు, తిరుప్పూర్, కడలూరు, ఈరోడ్, విల్లుపురం, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు, చెన్నై, తిరువణ్ణామలై, వెల్లూరు, రాణిపేటై, తిరుపత్తూరు, కళ్లకురిచ్చి, సేలం మీదుగా ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది