హైదరాబాద్‌కు భారీ ముప్పు పొంచివుందని ఐఎండీ హెచ్చరిక
హైదరాబాద్‌కు భారీ ముప్పు పొంచివుందని ఐఎండీ హెచ్చరించారు
- By Sudheer Published Date - 03:04 PM, Wed - 26 July 23

హైదరాబాద్ (Hyderabad)కు భారీ ముప్పు పొంచివుందని ఐఎండీ హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నాల్గు రోజులుగా భారీ నుండి అతి భారీ వర్షాలు (Rains) కురుస్తుండడం తో వాగులు , వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎక్కడిక్కడే రోడ్లు తెగిపోయి ప్రజా రవాణా స్థంభించిపోయింది. మరో రెండు , మూడు రోజల పాటు ఇలాగే వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలుపడం తో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, కాలువలు, నదులు, రిజర్వాయర్లు, చెరువుల వద్దకు వెళ్లోద్దని , చెట్ల కింద, పాడైన భవనాల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాల్లో ఉండకూడదని , కరెంట్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు ముట్టుకోరాదని , అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలని సూచిస్తున్నారు.
ఇక హైదరాబాద్ విషయానికి వస్తే ..సాయంత్రం లోపు హైదరాబాద్ లో భారీ వర్షం (Heavy Rain Alert) పడబోతుందని ఐఎండీ హెచ్చరించారు. ఇప్పటికే గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు భాగ్యనగరం అతలాకుతలం అవుతుంది. లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. మూసి నది ఉదృతగా ప్రవహిస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు ఐఎండీ హెచ్చరిక నగరవాసులను ఖంగారుకు గురిచేస్తుంది. నగరంలోని చార్మినార్, ఖైరతాబాద్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి జోన్ల పరిధిలో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అతిభారీ వర్షాలు, గాలులతో చెట్లు కూలడం, విద్యుత్తు స్తంభాలు దెబ్బతినే అవకాశం సూచించింది. అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని తెలిపింది. గంటలో 3-5 సెం.మీ నుంచి 5-10 సెం.మీ వాన కురిసే అవకాశం అప్రమత్తం చేసింది.
Read Also : Political Proffessor CBN : రాయలసీమద్రోహి జగన్ టైటిల్ తో చంద్రబాబు `PPT`