Bhadrachalam : భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
భద్రాచలం వద్ద గోదావరి వరద క్రమంగా పెరుగుతంది...
- By Prasad Published Date - 09:48 AM, Tue - 13 September 22

భద్రాచలం వద్ద గోదావరి వరద క్రమంగా పెరుగుతంది. రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ గోదావరికి వరద మరింత పెరుగుతోంది. భద్రాచలం దగ్గర సోమవారం ఉదయం 11 గంటలకు 41 అడుగులకు చేరిన నీటిమట్టం.. అర్ధరాత్రి 12 గంటలకు 48 అడుగులకు పెరగడంతో జిల్లా కలెక్టర్ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరిలో 12,51,999 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఎగువన కురుస్తున్న భారీవర్షాలకు గోదావరికి వరద ప్రవాహం పెరిగినట్లు అధికారులు తెలిపారు.