Harish Rao: కరోనాను ఎదుర్కొనేందుకు వైద్యశాఖ సిద్ధం!
- By Balu J Published Date - 03:34 PM, Mon - 17 January 22

తెలంగాణలో విస్తరిస్తున్న కరోనాను ఎదుర్కొనేందుకు వైద్యశాఖ సిద్ధంగా ఉందని హెల్త్ మినిస్టర్ హరీశ్ రావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి అధ్యక్షతన సోమవారం ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశమైంది. ముందుగా రాష్ట్రంలో కరోనా పరిస్థితి పై చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు, రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై గణాంకాలతో సహా వివరించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి అదుపులో ఉన్నదని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సంసిద్ధంగా ఉన్నదని హరీశ్ రావు తెలిపారు.