Harish Rao: అమిత్ షా టూర్ పై హరీశ్ రావు ఆసక్తికరమైన ట్వీట్…
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనపై మంత్రి హరీశ్ రావు ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.
- Author : Hashtag U
Date : 14-05-2022 - 8:42 IST
Published By : Hashtagu Telugu Desk
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనపై మంత్రి హరీశ్ రావు ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. శనివారం ప్రపంచ వలస పక్షుల దినోత్సవం సందర్భంగా ట్వీట్ చేసారు హరీశ్. అమిత్ షాను కూడా వలస పక్షులతో పోల్చి వ్యంగ్యాస్త్రాలు సంధించారు ఆయన.
వలస పక్షులు తమకు ఇష్టమైన ప్రాంతాలకు వస్తుంటాయన్నారు హరీశ్ రావు. ఆయా ప్రాంతాల్లో లభించే ఆహారాన్ని తింటూ ఎంజాయ్ చేస్తాయి. ఆ తర్వాతే గుడ్లు పెట్టి తిరిగి తమ ప్రాంతాలకు వెళ్లిపోతాయి. అదేంటో గానీ అమిత్ షా తెలంగాణ పర్యటన కూడా వలస పక్షుల దినోత్సవం నాడే జరుగుతోందని సెటైర్ సంధించారు హరీశ్ రావు.
Migratory Birds visit the favourable places, enjoy the food, lay eggs n fly away happily. A representative Coincidence. #WorldMigratoryBirdDay pic.twitter.com/tPDiwF4UMn
— Harish Rao Thanneeru (@BRSHarish) May 14, 2022