Half Day Schools : రేపటి నుంచి తెలంగాణలో హాఫ్‌డే స్కూల్స్
రేపటి నుంచి తెలంగాణలోని పాఠశాలలు ఒక్క పూట నిర్వహించనున్నారు. 2022 - 2023 విద్యా సంవత్సరానికి మార్చి 15 నుండి
- Author : Prasad
Date : 14-03-2023 - 6:48 IST
Published By : Hashtagu Telugu Desk
రేపటి నుంచి తెలంగాణలోని పాఠశాలలు ఒక్క పూట నిర్వహించనున్నారు. 2022 – 2023 విద్యా సంవత్సరానికి మార్చి 15 నుండి చివరి పనిదినం అంటే ఏప్రిల్ 24 వరకు ఒక్కపూట పాఠశాలలను నిర్వహించనున్నట్లు తెలంగాణ పాఠశాల విద్యా డైరెక్టర్ ప్రకటించారు. తెలంగాణలోని పాఠశాల విద్య అన్ని ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్లు, జిల్లా విద్యా అధికారుల (DEOs)కి సర్క్యులర్ జారీ చేశారు. పాఠశాల విద్యా డైరెక్టర్ మాట్లాడుతూ అన్ని స్కూల్ జమాన్యాల పరిధిలోని పాఠశాలలు అంటే ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12.30 వరకు పని చేస్తాయని తెలిపారు. మధ్యాహ్నం 12:30 గంటలకు మధ్యాహ్న భోజన విరామం ఉంటుందని.. SSC పబ్లిక్ ఎగ్జామినేషన్, ఏప్రిల్-2023కి సిద్ధమవుతున్న Xవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతాయన్నారు. ఎస్‌ఎస్‌సీ పరీక్షా కేంద్రాలు ఉన్న పాఠశాలలు మధ్యాహ్నం 1 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయని సర్క్యులర్‌లో పేర్కొంది.