Andhra Pradesh : ఏపీలో ఈ నెల 24 వరకు కొనసాగనున్న హాఫ్ డే స్కూళ్లు
రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జూన్ 24 వరకు హాఫ్ డే స్కూళ్లు కొనసాగించాలని
- By Prasad Published Date - 08:39 AM, Mon - 19 June 23

రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జూన్ 24 వరకు హాఫ్ డే స్కూళ్లు కొనసాగించాలని విద్యాశాఖ నిర్ణయించింది. పాఠశాలలు ఉదయం 7.30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నడుస్తాయి. ఇది అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలకు వర్తిస్తుందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ తెలిపారు. 2023-24 విద్యా సంవత్సరానికి పాఠశాలలు జూన్ 12న తిరిగి తెరుచుకున్నాయి. అయితే రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ రాష్ట్రంలో సింగిల్ సెషన్‌ను నిర్వహిస్తోంది . జూన్ 24 వరకు హాఫ్ డే స్కూళ్లు జరగనున్నాయి.