Gutha Sukender Reddy : “మనం చేస్తే సుందరీకరణ, కానీ అవతలి వారు చేస్తే వేరేదా?”.. కేటీఆర్‌పై గుత్తా ఫైర్
Gutha Sukender Reddy : మూసీ పై కేటీఆర్ చేసిన ట్విట్ కు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. మనం చేస్తే సుందరీకరణ.. అవతలి వారు చేస్తే వేరేదా? అని ప్రశ్నించారు.
- By Kavya Krishna Published Date - 11:57 AM, Fri - 18 October 24

Gutha Sukender Reddy : తెలంగాణలో హైడ్రా, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ అంశాలు హాట్ టాపిక్‌గా మారాయి. గత కొద్ది రోజులుగా ఉదయం నుంచి రాత్రి వరకు తెలంగాణ రాజకీయాల్లో వీటిపై ప్రస్తావన వస్తూనే ఉంది. అయితే.. మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుపై రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కేటీఆర్ చేసిన ట్వీట్స్ పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “మనం చేస్తే సుందరీకరణ, కానీ అవతలి వారు చేస్తే వేరేదా?” అని ఆయన ప్రశ్నించారు. మాజీ పట్టణాభివృద్ధి మంత్రి తెలివిగా మాట్లాడుతున్నారని, ఈ దిశగా ఉన్న తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు కింద బీఆర్ఎస్ , బీజేపీ నాయకత్వాల వ్యవహారాలను గుత్తా సుఖేందర్ రెడ్డి దూషించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్‌ను ఆయన స్వాగతిస్తున్నట్టు ప్రకటించారు, గత ప్రభుత్వాలు కేవలం మాటలతోనే పరిమితమయ్యాయని అన్నారు. “మూసీ పరివాహక ప్రాంతాల ప్రజల కోసం నందనవనంలో వేయికి పైగా ఇళ్లు నిర్మించామని” ఆయన గుర్తు చేశారు.
Ragging Culture: కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీలో ర్యాగింగ్ భూతం..!
ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా ఏదో చేస్తున్నట్టు వ్యతిరేక ప్రచారం చేయడం సరికాదని అన్నారు. ఆయన కింద రైతులు వేల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారని, దానికి సంబంధించిన పరిస్థితులను పరిశీలించాలి అన్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి, “ప్రత్యామ్నాయం చూపకుండా మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను ఖాళీ చేస్తే తప్పుగా ఉంటుంద”న్నారు. “, అందరికి పునరావాసం కల్పిస్తున్నప్పుడు, ఆందోళన ఎందుకు?” అని ఆయన మండిపడ్డారు. మూసీ ప్రక్షాళన గురించి పర్యావరణ వేత్తలు కూడా దృష్టి పెట్టాలని ఆయన కోరారు. “మూసీని జీవ నదిగా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డిని నేను కోరుతున్నాను,” అన్నారు.
మునిసిపల్ అధికారులు పరిశీలన లేకుండా అనుమతులు ఇస్తున్నారని ఆరోపిస్తూ, చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. “ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి,” అని ఆయన అన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాల తీరును ప్రజలు ఎండగట్టాలని గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. “అవసరం ఉంటే మూసీ ప్రక్షాళన కోసం ఉద్యమానికి దిగాలని నేను ప్రజలకు సూచిస్తున్నాను,” అన్నారు.
CM Chandrababu: చంద్రబాబు అధ్యక్షతన నేడు టీడీఎల్పీ సమావేశం..