Pulivendula : సీఎం జగన్ ఇలాకాలో కాల్పుల కలకలం.. ఒకరు మృతి, మరొకరికి గాయాలు
కడప జిల్లా పులివెందులలో జరిగిన కాల్పుల ఘటన కలకలం సృష్టిస్తోంది. సీఎం జగన్ సొంత నియోజకవర్గంలో కాల్పులు
- By Prasad Published Date - 07:05 PM, Tue - 28 March 23

కడప జిల్లా పులివెందులలో జరిగిన కాల్పుల ఘటన కలకలం సృష్టిస్తోంది. సీఎం జగన్ సొంత నియోజకవర్గంలో కాల్పులు జరగడం కలకలం రేపుతుంది. ఆర్థిక వివాదంపై స్థానిక బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం వద్ద భరత్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి కాల్పులు జరపడంతో దిలీప్, మస్తాన్ అనే ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన దిలీప్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. తీసుకున్న అప్పు తిరిగి రాకపోవడంతో భరత్ కుమార్ తన బావమరిది దిలీప్ పై, ఆపై మస్తాన్ బాషాపై పిస్టల్ తో నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో గాయపడిన దిలీప్ పులివెందుల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మస్తాన్ బాషాను కడప రిమ్స్‌కు తరలించారు. కాల్పులు జరిపిన భరత్ కుమార్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు భరత్ కుమార్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం.