Gujarat ATS: అమీర్‌పేట్ కోచింగ్ సెంటర్లలో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సోదాలు
హైదరాబాద్ అమీర్‌పేటలోని పలు కోచింగ్ సెంటర్లలో గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సోదాలు నిర్వహించింది.
- Author : Praveen Aluthuru
Date : 28-06-2023 - 3:45 IST
Published By : Hashtagu Telugu Desk
Gujarat ATS: హైదరాబాద్ అమీర్‌పేటలోని పలు కోచింగ్ సెంటర్లలో గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సోదాలు నిర్వహించింది. నిషేధిత ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసన్ ప్రావిన్స్ (ఐఎస్‌కెపి)కి సంబంధించిన ఉగ్రదాడి కేసు దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు పాల్పడింది. అంతకుముందు ఈ కేసులో భాగంగా ఓ 18 ఏళ్ళ యువకుడితో సహా మరో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించింది యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్.
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసన్ ప్రావిన్స్ (ఐఎస్‌కెపి) ఉగ్రదాడి కేసు దర్యాప్తులో భాగంగా గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ టోలిచౌకిలోని ఓ ఇంట్లో సోదాలు నిర్వహించినట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి. అయితే అక్కడ మహ్మద్ జావేద్ (46), అతని కుమార్తె ఖదీజా (20) లు లేకపోవడంతో రామగుండంలో వారిని అదుపులోకి తీసుకున్నారు.మహ్మద్ జావేద్, అతని కుమార్తె ఖదీజాలను యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించినట్లు సమాచారం. తండ్రీకూతుళ్లిద్దరూ హైదరాబాద్‌లోని టోలీచౌకి నివాసి కాగా, నాలుగు రోజుల క్రితం ఎన్‌టీపీసీలోని బంధువుల ఇంటికి వచ్చారు.
Read More: Jagan on Pawan: నలుగురిని పెళ్లి చేసుకుని.. నాలుగేళ్లకోసారి భార్యలను మార్చుకోలేం: పవన్ పై జగన్ ఫైర్!