HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Gudivada Amarnath Sensational Comments On Pawan Over Vissannapeta Issue

AP : పవన్ కల్యాణ్‌ వెంట్రుక కూడా పీకలేపోయాడంటూ మంత్రి అమర్నాథ్‌ కౌంటర్

విస్సన్నపేట సందర్శన కొండను తవ్వి ఎలుకను పట్టలేదు కాదు కదా.. వెంట్రుక కూడా పీకలేకపోయారన్నారు

  • Author : Sudheer Date : 15-08-2023 - 9:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gudivada Amarnath Sensational Comments On Pawan Over Vissannapeta issue
Gudivada Amarnath Sensational Comments On Pawan Over Vissannapeta issue

బోయపాటి మూవీస్ లలో ఎక్కువగా ‘వెంట్రుక కూడా పీకలేరు’ అనే డైలాగ్ తప్పనిసరిగా ఉంటుంది. అది హీరో నుంచైనా, విలన్ నుండైనా ఈ డైలాగ్ వినిపిస్తుంది. ఈ డైలాగే ఇప్పుడు వైసీపీ నేతలు తరుచు వాడుతున్నారు. మంత్రి రోజా , కొడాలి నాని , పేర్ని నాని ఎక్కువగా వాడుతుంటారు..అది కూడా పవన్ కళ్యాణ్ ఫైనే. ఇక ఇప్పుడు ఇదే డైలాగ్ ను మంత్రి అమర్నాథ్‌ (Gudivada Amarnath) వాడుతున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫై కౌంటర్ ఇస్తూ..పవన్ కల్యాణ్‌ విస్సన్నపేట (Vissannapeta ) సందర్శన కొండను తవ్వి ఎలుకను పట్టలేదు కాదు కదా.. వెంట్రుక కూడా పీకలేకపోయారు అన్నారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి మూడో యాత్ర  (Varahi Yatra)కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం విస్సన్న పేట లో పర్యటించారు. ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతూ..వైసీపీ ప్రభుత్వం ఫై మండిపడ్డారు. విస్సన్నపేటలో వాల్టా చట్టానికి విరుద్దంగా పనులు చేస్తున్నారని , ఉత్తరాంధ్రలో ఎక్కడా అభివృద్ధి జరగడం లేదని , యువతకు ఉపాధి, ఉద్యోగాలు లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి కోసం ఉత్తరాంధ్ర యువత ఎక్కడెక్కడికో వలసలు పోతున్నారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు లేవు కానీ రియల్ ఏస్టేట్ వ్యాపారం చేస్తున్నారన్నారు. నిబంధనలకు విరుద్దంగా రియల్ ఏస్టేట్ వ్యాపారం సాగుతున్న ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఈ దోపీడికి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కూడ వత్తాసు పలుకుతున్నారని ఆయన ఆరోపించారు.

పవన్ ఆరోపణలపై మంత్రి గుడివాడ అమర్నాధ్ స్పందించారు. పవన్ కల్యాణ్‌ విస్సన్నపేట సందర్శన కొండను తవ్వి ఎలుకను పట్టలేదు కాదు కదా.. వెంట్రుక కూడా పీకలేకపోయారన్నారు. రుషికొండ పేలిపోయి జగన్మోహన్ రెడ్డి అందులో కూరుకుపోవాలనే పవన్ వ్యాఖ్యలు విద్వేషంతో కూడుకున్నవి అని అమర్నాధ్ అన్నారు. రుషికొండలో ఎటువంటి ఉల్లంఘణలు కనిపించక వెనక్కి తిరిగొచ్చారన్న ఆయన.. సీఎం వైఎస్‌ జగన్ వంటి రియల్ లైఫ్ హీరోను చూసి.. ఈర్ష్య ఎందుకో పవన్ కళ్యాణ్ చెప్పాలి..? అని ప్రశ్నించారు.

యువకులను సినిమా అనే ట్రాన్స్ లోకి తీసుకెళ్లి విచ్చలవిడిగా పవన్ వాడుకుంటున్నాడని, ఓ కీచక గురువుగా పవన్ మారడంటూ అమర్నాధ్ ఫైర్ అయ్యారు. నాపై, మా ప్రభుత్వం మీద దోపిడీ దారులు అనే ముద్ర వేసేందుకు పవన్ కల్యాణ్‌ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు అంటూ తిప్పికొట్టారు. తరతరాలుగా రాజకీయాల్లో ఎదిగిన వాళ్లం.. మేం ప్రజలకు, ప్రభుత్వానికి కస్టడీయన్ గా వ్యవహరిస్తోందన్నారు.

Read Also : 77th Independence Day: స్వాతంత్య్ర యోధుల త్యాగాలను దేశం మరువదు.. ఎర్రకోటలో ప్రధాని మోడీ ప్రసంగం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • Gudivada Amarnath
  • Pawan
  • Vissannapeta

Related News

Gade Venkatreddy

Gade Venkatreddy : మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు గాదె వెంకటరెడ్డి (86) శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్యంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గాదె వెంకటరెడ్డి మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, వివిధ పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో ఆయన అందించిన సేవ

  • Tdp Mla Bandaru Sravani

    Mahanadu : మహిళా సాధికారతే టీడీపీ లక్ష్యం.. మహానాడులో ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి

  • ACB raids

    ACB Raids : మాజీ ఏపీ భవన్ అధికారి ఇళ్ల‌లో ఏసీబీ సోదాలు.. కోట్ల విలువైన అక్రమ ఆస్తుల గుర్తింపు

  • Msme Summit 2026

    AP : ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ – 2026లో కీలక ఒప్పందాలు చేసుకున్న ఏపీ ప్ర‌భుత్వం

  • Online Petrol

    Petrol Price : మ‌రోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు.. ప‌దిరోజుల్లో నాలుగు సార్లు

Latest News

  • BRS : మాజీ ఎమ్మెల్యే  బాల్కా సుమన్ అరెస్ట్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేసు నమోదు

  • Revanth Reddy : తెలుగు ఆత్మగౌరవం నుంచి ప్రజా సంక్షేమం వరకు.. రేవంత్ రెడ్డి విజన్

  • Krishna Jayashankar : బాడీ షేమింగ్ నుంచి బంగారు పతకం వరకు.. కృష్ణ జయశంకర్ సరికొత్త చరిత్ర!

  • Telangana : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

  • Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd