Hyderabad: రెండో తరగతి బాలికపై 9వ తరగతి విద్యార్థి లైంగిక వేధింపులు
హైదరాబాద్ లో మరో లింగిక వేధింపుల ఘటన వెలుగు చూసింది. అయితే అందరూ ఆశ్చర్యపడేలా 2వ తరగతి బాలికపై తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థి అసభ్యంగా ప్రవర్తించడం ఆందోళన కలిగిస్తుంది.
- By Praveen Aluthuru Published Date - 07:51 PM, Fri - 2 August 24

Hyderabad: రెండో తరగతి బాలికపై 9వ తరగతి విద్యార్థి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లోని లిటిల్ ఫ్లవర్ స్కూల్‌లో రెండో తరగతి చదువుతున్న బాలికపై 9వ తరగతి విద్యార్థి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో వెంటనే బాలుడిని పాఠశాల నుంచి బయటకు పంపించి, తల్లిదండ్రులకు సమాచారం అందించామని స్కూల్ యాజమాన్యం తెలిపింది. పోలీసుల విచారణ జరుగుతోంది.
కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, బిజెపి కార్యకర్తలు హైదరాబాద్‌లోని పాఠశాల ఆవరణలో నిరసన చేపట్టారు. పాఠశాల యాజమాన్యం, పోలీసులు ఘటనను అణిచివేసేందుకు ప్రయత్నించారని వారు ఆరోపించారు. ఘటనపై విచారణలో పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశారు.
Also Read: IND vs SL 1st ODI: శ్రీలంకపై రోహిత్ ఎటాక్.. హాఫ్ సెంచరీ పూర్తి