Finance Minister Gesture: నిర్మలా సీతారామన్ చేసిన పనికి నెట్టింట హర్షం…వీడియో వైరల్.!!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ఓ పని ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. సాధారణంగా రాజకీయ నాయకులు తమ హోదా, ప్రొటోకాల్ కోసం వెంపర్లాడుతుంటారు.
- Author : Hashtag U
Date : 09-05-2022 - 6:49 IST
Published By : Hashtagu Telugu Desk
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ఓ పని ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. సాధారణంగా రాజకీయ నాయకులు తమ హోదా, ప్రొటోకాల్ కోసం వెంపర్లాడుతుంటారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం అందుకు భిన్నం అనే చెప్పాలి. తాజాగా నేషనల్ సెక్యూరిటీ డిపాజిట్ లిమిటెడ్ (ఎన్ఎస్ డీఎల్) సిల్వర్ జూబ్లీ వేడుకల్లో NSDL ఎండీ పద్మజా చుండూరు ప్రసంగిస్తున్న సమయంలో నిర్మలా సీతారామన్ తీసుకున్న చొరవ సభికులను ఆశ్చర్యపరించింది, అంతేకాదు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళితే నేషనల్ సెక్యూరిటీ డిపాజిట్ లిమిటెడ్ (ఎన్ఎస్ డీఎల్) సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా ముంబైలోని ఓ హోటల్లో పెట్టుబడి అవగాహనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా NSDL ఎండీ పద్మజా చుండూరు వేదికపై ప్రసంగిస్తూ మంచి నీళ్లు కావాలంటూ నిర్వాహకులను అభ్యర్థించారు. ఇది గమనించిన నిర్మలా సీతారామన్, వెంటనే ఓ వాటర్ బాటిల్ తో పద్మజా వద్దకు సమీపించి ఆమె మంచి నీరు సర్వ్ చేశారు. దీంతో ఎండీ పద్మజా చుండూరు కాస్త విస్మయానికి లోనయ్యారు.
వేదికపై ముఖ్యఅతిథిగా ఉన్న నిర్మల సీతారామన్ వెంటనే తన కుర్చీ నుంచి లేచి పద్మజా చుండూరుకు దగ్గరికి వెళ్లి గ్లాస్ తో పాటు మంచినీళ్ళ బాటిల్ ను అందించడంతో సభలో ఒక్కసారిగా చప్పట్లతో దద్దరిల్లింది. నిర్మలా సీతారామన్ చేసిన పనిని అభినందిస్తూ సభకు హాజరైన వారంతా చప్పట్లతో ప్రశంసించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్ చేస్తూ -: ఇది కేంద్ర ఆర్థిక శాఖ నిర్మలా సీతారామన్ విశాల హృదయం, వినయం, విలువలను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ‘ఇది ఎంత అద్భుతమైన సంఘటన.. మీ వినయాన్ని ఎంతో గౌరవిస్తున్నాను మేడం’ అంటూ నిస్సాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీఈఓ సందీప్ సైతం ట్వీట్ చేయడం విశేషం.
This graceful gesture by FM Smt. @nsitharaman ji reflects her large heartedness, humility and core values.
A heart warming video on the internet today. pic.twitter.com/isyfx98Ve8
— Dharmendra Pradhan (@dpradhanbjp) May 8, 2022