Governor:జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనపై గవర్నర్ సీరియస్…రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి..!!
జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనపై సీరియస్ అయ్యారు తెలంగాణ గవర్నర్ తమిళిసై. ఈ ఘటనపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
- By hashtagu Published Date - 02:13 PM, Sun - 5 June 22

జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనపై సీరియస్ అయ్యారు తెలంగాణ గవర్నర్ తమిళిసై. ఈ ఘటనపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాలికపై సామూహిక అత్యాచార ఘటన తనను ఎంతగానో కలిచివేసిందన్నారు. దీనికి సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలను తాను పరిశీలిస్తున్నానని..కేసుకు సంబంధించిన పూర్తి నివేదికను రెండు రోజుల్లోగా అందించాలని సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డిని గవర్నర్ ఆదేశించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరుగుతుండటం బాధాకరమన్నారు.
అమ్రీషియా పబ్ నుంచి బాలికను ఐదుగురు కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై ప్రతిపక్షాలు పోలీసుల తీరుపై మండిపడ్డాయి. హోంమంత్రి మనవడు ఉన్నాడని ఆరోపణలు వచ్చినా.వాటిని పోలీసులు ఖండించారు. కాగా నిన్న వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ కుమారుడితోపాటు మరో ఇద్దర్ని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.