TTD: టీటీడీ భక్తులకు గుడ్ న్యూస్.. జూన్ నెల శ్రీవారి దర్శనం, ఆర్జితసేవా టికెట్లు విడుదల
- By Balu J Published Date - 05:34 PM, Wed - 13 March 24
TTD: తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం జూన్ నెలకు సంబంధించి ఆన్లైన్లో విడుదల చేయనున్న దర్శనం, ఆర్జితసేవా టికెట్లు, శ్రీవారి సేవ కోటా వివరాలు ఇలా ఉన్నాయి. మార్చి 18వ తేదీ ఉదయం 10 నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల లక్కీడిప్ కోసం నమోదు చేసుకోవచ్చు. మార్చి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు సొమ్ము చెల్లించి టికెట్లు ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు ఈ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి. https://ttdevasthanams.ap.gov.
మార్చి 21వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటాను విడుదల చేస్తారు. జూన్ 19 నుండి 21వ తేదీ వరకు జరుగనున్న జ్యేష్టాభిషేకం ఉత్సవంలో పాల్గొనేందుకు మార్చి 21న ఉదయం 10 గంటలకు భక్తులకు అందుబాటులో ఉంచుతారు. మార్చి 21న మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి వర్చువల్ సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తారు. మార్చి 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు అందుబాటులో ఉంటాయి. మార్చి 27 వరకు అన్ని రకాల టికెట్లను అందుబాటులో ఉంచింది. మొన్నటి వరకు తిరుమలలో భక్తుల రద్దీ ఉండగా క్రమక్రమంగా తగ్గుతోంది.
Tags
Related News
TTD: “గోవింద కోటి” రాసిన బెంగుళూరుకు చెందిన కీర్తన, విఐపి బ్రేక్ లో శ్రీవారి దర్శనం
TTD: మొట్టమొదటిసారిగా “గోవింద కోటి”ని రాసిన విద్యార్థిని కీర్తనకు మంగళవారం ఉదయం టిటిడి శ్రీవారి బ్రేక్ దర్శనం కల్పించింది. బెంగుళూరుకు చెందిన ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కుమారి కీర్తన 10 లక్షల ఒక వెయ్యి 116 సార్లు గోవింద కోటిని రాసింది. ఈ సందర్భంగా కీర్తన మీడియాతో మాట్లాడుతూ, తమ పెద్దలు, ఊరివారు చిన్నతనం నుండి రామకోటి రాయడం చూసేదానినన్నారు. మా కులదై�