South Central Railway: రైల్యే ప్రయాణికులకు గుడ్ న్యూస్
- Author : HashtagU Desk
Date : 11-02-2022 - 3:56 IST
Published By : Hashtagu Telugu Desk
రైలు ప్రయాణికులకు, తాజాగా దక్షిణమధ్య రైల్వే సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు గంటలు, గంటలు లైన్‌లో నిలబడి ప్రయాణికులు టికెట్ కొనుక్కుంటూ వస్తున్నారు. అయితే ఇకముందు ప్రయాణికులు, ట్రైన్ టికెట్ కోసం క్యూ లైన్లలో పడిగాపులుపడాల్సిన పనిలేదని దక్షిణమధ్య రైల్వే సంస్థ తెలిపింది. ఈ క్రమంలో దక్షిణమధ్య రైల్వే సంస్థ క్యూఆర్ కోడ్‌ను అమలులోకి తెచ్చిందని, దీంతో ప్లాట్‌ఫామ్ టిక్కెట్స్ అండ్ అన్ రిజర్వ్‌డ్ రైల్వే టిక్కెట్స్ కోసం క్యూ లైన్‌లో నిల్చోవాల్సిన అవసరంలేదని, క్యూఆర్ కోడ్‌తో టికెట్స్ తీసుకోవచ్చని దక్షిణమధ్య రైల్వే సంస్థ వెల్లడించింది. నగదు రహిత సేవలను ప్రోత్సహిస్తూ, డిజిటల్ చెల్లింపులను పెంచేందుకు దక్షిణమధ్యరైల్వే సంస్థ ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టిందని సమాచారం.