Gold- Silver Price: ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..?
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold- Silver Price) నేడు స్థిరంగా ఉన్నాయి.
- By Gopichand Published Date - 07:42 AM, Tue - 21 November 23

Gold- Silver Price: కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold- Silver Price) నేడు స్థిరంగా ఉన్నాయి. మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,500గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,640గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. కిలో వెండి ధర రూ.79,000కు చేరుకుంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.
బంగారం, వెండి ధరలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక మంగళవారం (నవంబర్ 21, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!
బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,650 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,790గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.57,050 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,230గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,500 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.61,640 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,640గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,640గా ఉంది.
We’re now on WhatsApp. Click to Join.
వెండి ధరలు
ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 76,000 ఉండగా, ముంబైలో రూ.76,000గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.79,000 ఉండగా, కోల్‌కతాలో రూ.76,000గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.75,000 ఉండగా, కేరళలో రూ.79,000గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.79,000 ఉండగా, విజయవాడలో రూ.79,000 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.