Gold Seized : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత
హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కిలోకు పైగా బంగారం పట్టుబడింది. మస్కట్ నుంచి హైదరాబాద్‌కు
- Author : Prasad
Date : 16-05-2023 - 9:37 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కిలోకు పైగా బంగారం పట్టుబడింది. మస్కట్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీలో శానిటరీ ప్యాడ్‌లో దాచిన 1,476 గ్రాముల బంగారాన్ని పేస్ట్ రూపంలో గుర్తించారు. ప్యాసింజర్ ప్రయాణించే సీటుకు సమీపంలోనే శానిటరీ ప్యాడ్ దాచి ఉంచారు. రూ. 77,90,534 విలువైన స్మగ్లింగ్ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారతీయ కస్టమ్స్ చట్టం, 1962 కింద ప్రయాణికురాలిని అరెస్టు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.