Gold Seize In Airport : గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత..?
గన్నవరం విమానాశ్రయం లో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో భారీగా బంగారం...
- By Prasad Published Date - 03:11 PM, Fri - 9 September 22

గన్నవరం విమానాశ్రయం లో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో భారీగా బంగారం పట్టుబడినట్లు సమాచారం. నిన్న సాయంత్రం దుబాయ్ నుండి వచ్చిన విమానం లో భారీగా బంగారాన్ని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి స్పెషల్ టీమ్ వచ్చి గన్నవరం విమానాశ్రయం లో నిన్న సాయంత్రం నుండి ఈ బంగారంపై విచారణ చేస్తున్నారు. సీఎంఓ కార్యాలయం లో కీలక అధికారి భార్య దుబాయ్ నుండి బంగారం తీసుకుని వచ్చినట్లు సమాచారం. ఎయిర్ ఇండియా సంస్థ లో పని చేస్తున్న ఇద్దరు సిబ్బంది కింద స్థాయి, పై స్థాయి ఉద్యోగులు సహకరించినట్లు సమాచారం. బంగారం తీసుకొని వచ్చిన మహిళ తో పాటు ఎయిర్ ఇండియా సిబ్బంది ని కూడా కస్టమ్స్ అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం.