Gold Rates: పసిడి ధరలు డౌన్.. కొనేముందు నేటి బంగారం, వెండి రేట్స్ తెలుసుకోండి..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Rates) నేడు మరోసారి తగ్గుముఖం పట్టాయి.
- By Gopichand Published Date - 06:50 AM, Fri - 26 May 23

Gold Rates: కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Rates) నేడు మరోసారి తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర (Gold Rates) రూ.55,800గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,870గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. కిలో వెండి ధర రూ.76,500కు చేరుకుంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.
బంగారం, వెండి ధరలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక శుక్రవారం (మే 26, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!
Also Read: Plastic Water Bottles : ప్లాస్టిక్ బాటిల్స్ లో వేడి నీళ్లను తాగవచ్చా?
బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,950 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.61,020గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.56,250 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,360గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,800 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.60,870 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.55,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,870గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.55,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,920గా ఉంది.
వెండి ధరలు
ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 73,050 ఉండగా, ముంబైలో రూ.73,050గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.76,500 ఉండగా, కోల్‌కతాలో రూ.73,050గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.76,500 ఉండగా, కేరళలో రూ.76,500గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.76,500 ఉండగా, విజయవాడలో రూ.76,500 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.

Related News

Elon Musk: ప్రపంచ కుబేరుడిగా ఎలాన్ మస్క్.. రెండో స్థానంలో బెర్నార్డ్ ఆర్నాల్ట్..!
ఎలాన్ మస్క్ (Elon Musk) మరోసారి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అయ్యాడు. టెస్లా CEO ఎలాన్ మస్క్ (Elon Musk), ఫ్రెంచ్ పారిశ్రామికవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను వెనక్కి నెట్టారు.