Gold Rate Today : పసిడి పరుగులకు బ్రేక్.. నేటి బంగారం ధరలు ఎంతంటే..?
Gold Rate Today : బంగారం ధరలకు మళ్లీ డిమాండ్ పెరిగింది. గత వారం తగ్గిన ఈ రేట్లు, మళ్లీ పుంజుకున్నాయి. అయితే ప్రస్తుతం మాత్రం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. మరి దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
- By Kavya Krishna Published Date - 10:43 AM, Mon - 25 November 24

Gold Rate Today : నవంబర్ మొదటి రెండు వారాల్లో భారీగా తగ్గిన బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటూ వినియోగదారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం తర్వాత, డాలర్ బలపడటంతో బంగారంలో పెట్టుబడులు తగ్గాయి. దీంతో బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి. అయితే ఇప్పుడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో కోత ఉంటుందని అంచనా వేయడంతో బంగారం రేట్లు తిరిగి పెరుగుతున్నాయి. తొలి రెండు వారాల్లో తగ్గిన ధర అంతా, కేవలం ఒక్క వారంలోనే పెరిగింది.
అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్థిరంగా పెరుగుతున్నాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతతో పెట్టుబడులు మళ్లీ బంగారంలోకి చేరుతున్నాయి. ఈ ప్రభావంతో స్పాట్ గోల్డ్ ఔన్సు ధర ప్రస్తుతం $2711 వద్ద ఉంది. స్పాట్ సిల్వర్ ఔన్సు ధర $31.24 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు, భారతీయ రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే ₹84.424 వద్ద ఉంది.
Eating Style : చెంచా లేకుండా చేతులతో తినడం ఆరోగ్యానికి మంచిదా, చెడ్డదా అని తెలుసుకోండి
హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు
హైదరాబాద్ మార్కెట్లో ఈ రోజు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి:
22 క్యారెట్ల బంగారం: 10 గ్రాములకు ₹73,000
24 క్యారెట్ల బంగారం: 10 గ్రాములకు ₹79,640
వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి
బంగారం ధరలు పెరుగుతున్నప్పటికీ, వెండి ధరలు గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్నాయి.
వెండి రేటు: కిలోకు ₹1,01,000
ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,990 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.79,630 వద్ద ఉంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,140 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.79,980 వద్ద ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,990 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.79,630 వద్ద ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,990 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.79,630 వద్ద ఉంది.
గమనించవలసిన విషయం ఏమిటంటే, బంగారం , వెండి ధరలపై జీఎస్టీ, ట్యాక్స్, సెస్స్, వ్యాట్ వంటి పన్నులు వర్తిస్తాయి. ఇవి ప్రాంతాన్ని బట్టి మారుతాయి. అందువల్ల కొనుగోలు చేసే ముందు స్థానిక జువెలర్స్ వద్ద తాజా ధరలను తెలుసుకోవడం మంచ
Pesticides In Food : పంట ఉత్పత్తుల్లో కెమికల్స్.. రైతుల రక్తంలో పురుగు మందుల అవశేషాలు