Gold And Silver Price Today: బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం ధర..!
దేశంలో బంగారం ధరలు (Gold, Silver Price Today) స్వల్పంగా దిగి వచ్చాయి. కొంతకాలంగా పెరుగుతూ పోతున్న పసిడి ధర నేడు దేశీయ మార్కెట్‌లో ఇలా ఉంది. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ. 150 తగ్గి రూ. 52,500కు చేరింది.
- By Gopichand Published Date - 07:50 AM, Wed - 1 February 23

దేశంలో బంగారం ధరలు (Gold, Silver Price Today) స్వల్పంగా దిగి వచ్చాయి. కొంతకాలంగా పెరుగుతూ పోతున్న పసిడి ధర నేడు దేశీయ మార్కెట్‌లో ఇలా ఉంది. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ. 150 తగ్గి రూ. 52,500కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 170 తగ్గి రూ. 57,270గా ఉంది. ఫిబ్రవరి 1న హైదరాబాద్‌లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.52,500గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ.57,270గా నమోదైంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు బుధవారం ఈ విధంగా ఉన్నాయి. ధరలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక బుధవారం (ఫిబ్రవరి 1, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!
బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,650 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.57,430గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.53,380 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.58,230గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,500 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.57,270 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.52,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,270గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,330గా ఉంది.
ఇకపోతే.. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.52,500 వద్ద కొనసాగుతోంది. ఇటు 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.57,270గా నమోదైంది. విజయవాడలో కూడా 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర స్థిరంగా రూ.52,500 వద్ద ఉంది. 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.57,270గా ఉంది.
Also Read: Electric Bike: లగ్జరీ ఎలక్ట్రిక్ బైక్ కేవలం రూ.40 కే.. అద్భుతమైన ఫీచర్ లతో?
వెండి ధరలు
ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 72,300 ఉండగా, ముంబైలో రూ.72,300గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.74,500 ఉండగా, కోల్‌కతాలో రూ.72,300గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.74,500 ఉండగా, కేరళలో రూ.74,500గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.74,500 ఉండగా, విజయవాడలో రూ.74,500 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.