Gold Price Today : పసిడి ప్రియులకు మంచి అవకాశం.. తగ్గిన బంగారం ధరలు..!
Gold Price Today: పెట్టుబడి పెట్టాలన్నా ఇది ఉత్తమ సాధనం. గోల్డ్‌తో పాటు సిల్వర్‌కు కూడా మంచి డిమాండ్ ఉంటుంది. అందుకే.. వీటి ధరల్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ఇవాళ బంగారం, వెండి ధరలు మళ్లీ దిగొచ్చాయి.
- By Kavya Krishna Published Date - 10:03 AM, Tue - 3 December 24

Gold Price Today : పెళ్లిళ్లు, శుభకార్యాలు అంటే చాలు ముందుగా మనకు గుర్తొచ్చేది బంగారమే. మన సంస్కృతి, సంప్రదాయాలతో ఇది అంతలా ముడిపడిపోయింది. అయితే.. బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి, ఇది పసిడి ప్రియులకు మంచి అవకాశం. అంతర్జాతీయంగా, దేశీయంగా కూడా గోల్డ్ రేట్లు తగ్గడం కొనసాగుతోంది. డిసెంబర్ 3 ఉదయం 7 గంటలకు అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2636 డాలర్ల వద్ద ఉంది, స్పాట్ సిల్వర్ ధర 30.60 డాలర్ల వద్ద కదలాడుతోంది.
Floater Credit Cards : ఫ్లోటర్ క్రెడిట్ కార్డ్స్ అంటే ఏమిటి ? వాటిని ఎలా వాడాలి ?
డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 84.70 వద్ద నిలిచింది, ఇది ఆల్ టైమ్ కనిష్టం. అంతర్జాతీయ స్థాయిలో ధరలు తగ్గడం దేశీయంగా బంగారం, వెండి రేట్లను కూడా ప్రభావితం చేస్తోంది. హైదరాబాద్, ఢిల్లీ నగరాల్లో తాజా ధరల వివరాలను చూద్దాం.
హైదరాబాద్‌లో బంగారం ధరలు:
22 క్యారెట్లు: తులానికి రూ. 600 తగ్గి రూ. 70,900
24 క్యారెట్లు: 10 గ్రాములకు రూ. 650 తగ్గి రూ. 77,350
ఢిల్లీ బంగారం ధరలు:
22 క్యారెట్లు: తులానికి రూ. 600 తగ్గి రూ. 71,050
24 క్యారెట్లు: 10 గ్రాములకు రూ. 650 తగ్గి రూ. 77,500
వెండి ధరలు:
హైదరాబాద్: కేజీ వెండి ధర రూ. 500 తగ్గి రూ. 99,500
ఢిల్లీ: కేజీ వెండి ధర రూ. 500 తగ్గి రూ. 91,000
బంగారం స్వచ్ఛత వివరాలు:
24 క్యారెట్లు: 99.9% స్వచ్ఛమైన మేలిమి బంగారం.
22 క్యారెట్లు: నగల తయారీకి ఉపయోగించే బంగారం, ఇతర లోహాల మిశ్రణతో ఉంటుంది.
ధరలు ప్రాంతాల వారీగా మారుతాయి. స్థానిక పన్నులు, జువెల్లరీల తయారీ ఖర్చులు కూడా గోల్డ్ రేట్లను ప్రభావితం చేస్తాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ధరలు చెక్ చేసుకోవడం ఉత్తమం.
(గమనిక: బంగారం, వెండి రేట్లు నిత్యమూ మారుతాయి. తాజా ధరలను సరిచూసుకోవడం అవసరం.)
Minister Sridhar Babu : ఉద్యోగావకాశాల కల్పనలో కాంగ్రెస్ ప్రభుత్వానిదే ఘనత – మంత్రి శ్రీధర్ బాబు