Minister Sridhar Babu : ఉద్యోగావకాశాల కల్పనలో కాంగ్రెస్ ప్రభుత్వానిదే ఘనత – మంత్రి శ్రీధర్ బాబు
Minister Sridhar babu : పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ 39వ వార్షిక దినోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. ఈ నెలలో 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు
- By Sudheer Published Date - 07:09 PM, Mon - 2 December 24

ప్రతి నెలా ఉద్యోగ అవకాశాలను కల్పించడమే..కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) అన్నారు. పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ (Pottisreeramulu Telugu University) 39వ వార్షిక దినోత్సవాల్లో ( 39th anniversary) ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. ఈ నెలలో 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ (Notification for 2 lakh jobs) విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా పరిశ్రమలను రాష్ట్రంలోకి ఆకర్షించడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరగనున్నాయని మంత్రి స్పష్టం చేశారు. కొత్త పరిశ్రమల ద్వారా నిరుద్యోగులకు సరైన ఉపాధి లభించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటు వల్ల కేవలం ఉద్యోగాలు మాత్రమే కాకుండా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని అభిప్రాయపడ్డారు.
కేవలం ప్రభుత్వ రంగ ఉద్యోగాలనే కాకుండా.. ఇతర కార్పొరేట్ రంగాల్లో ఖాళీలను భర్తీ చేయడానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి తెలిపారు. యువతకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి, వారికి అవసరమైన శిక్షణను అందిస్తామని చెప్పారు. ఖాళీల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఉద్యోగావకాశాల కల్పనలో కాంగ్రెస్ ప్రభుత్వం చూపిన పట్టుదల ఇతర ప్రభుత్వాలకు ఆదర్శప్రాయమని మంత్రి పేర్కొన్నారు. “యువత ఆశయాలను నెరవేర్చడమే మా ప్రభుత్వ లక్ష్యం. ప్రతి ఒక్క నిరుద్యోగి నవ్వేలా మార్గదర్శకాలను రూపొందిస్తున్నాం” అని అన్నారు. “మీరు మీ విద్యా రంగంలో సాధించిన విజయాలు దేశానికి బలమైన మూలస్తంభాలుగా నిలవాలి. అభివృద్ధికి బాసటగా మీరు ముందుకు రావాలి” మంత్రి పిలుపునిచ్చారు.
పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం 39 వ్యవస్థాపన దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. pic.twitter.com/psFNnS79rr
— Sridhar Babu Duddilla (@OffDSB) December 2, 2024
Read Also : Indian Astronauts : అమెరికాలో ‘గగన్‌యాన్’ ట్రైనింగ్.. ఇస్రో వ్యోమగాములకు ఏమేం నేర్పారంటే..?