1 KIlled : దసర నవరాత్రి ఉత్సవాల్లో విషాదం.. జాతరకు వెళ్లి కరెంట్ షాక్‌తో బాలిక మృతి
ఇండోర్‌లో నవరాత్ని ఉత్సవాల్లో విషాదం చోటుచేసుకుంది. ఇండోర్‌లోని నవరాత్రి ఫెయిర్ (మేళా)లో ఊయల (జూలా)పై సవారీ
- Author : Prasad
Date : 24-10-2023 - 4:45 IST
Published By : Hashtagu Telugu Desk
ఇండోర్‌లో నవరాత్ని ఉత్సవాల్లో విషాదం చోటుచేసుకుంది. ఇండోర్‌లోని నవరాత్రి ఫెయిర్ (మేళా)లో ఊయల (జూలా)పై సవారీ చేస్తుండగా విద్యుత్ షాక్‌తో 14 ఏళ్ల బాలిక మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పవన్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి జాతరకు వెళ్లారు. అక్కడ దర్శనం తర్వాత, అతని కుమారుడు. కుమార్తె ఊయల మీద సవారీ చేయడానికి వెళ్లారు. రైడ్ తర్వాత కిందకు దిగుతున్న సమయంలో అమ్మాయి, ఆమె తమ్ముడు ఇద్దరూ నేలపై ఉన్న లైవ్ వైర్లపైకి అడుగుపెట్టడంతో విద్యుత్ షాక్‌కు గురయ్యారు.10వ తరగతి చదువుతున్న బాలిక మృతి చెందగా, ఆమె తమ్ముడు గాయపడ్డారు. విద్యుత్ వైర్లు నెలపై వేసి నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాలిక కుటుంబం ఆరోపించింది. బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లడంలో పోలీసులు సహాయం చేయలేదని ఆరోపించారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.