HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Ghmc Campaign On Eco Friendly Ganesh Statues In Hyderabad

Ganesh idols : హైద‌రాబాద్‌లో ఎకో ఫ్రెండ్లీ గ‌ణేష్ విగ్ర‌హాల‌పై జీహెచ్‌ఎంసీ ప్ర‌చారం

  • Author : Prasad Date : 08-06-2022 - 8:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ganesh
Ganesh

ఈ ఏడాది ఆగస్టు 31న ప్రారంభమయ్యే గణేష్ చతుర్థి ఉత్సవాల కోసం కళాకారులు విగ్రహాల తయారీలో నిమగ్నమై ఉన్నారు. ఈ నేప‌థ్యంలో పర్యావరణ అనుకూలమైన విగ్రహాలను ప్రోత్సహించడానికి జీహెచ్ఎంసీ సిద్ధ‌మైంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, సింథటిక్ రంగులతో తయారు చేసిన వాటిని నిరోధించడానికి నగర పాలక సంస్థ ప్రయత్నాలు ప్రారంభించింది. నిమజ్జనం సమయంలో నీటి కాలుష్యానికి కారణం కాని విగ్రహాలను ప్రోత్సహించే కసరత్తులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తన జోనల్ ప్రాంగణంలో కాకుండా కీలక ప్రదేశాలలో మట్టి గణేష్ విగ్రహాలను ప్రతిష్టించి అంద‌రికి ఆద‌ర్శంగా ఉండాల‌ని భావిస్తుంది. అలాగే నగరంలోని మట్టి విగ్రహాల తయారీదారుల వివరాలను సేక‌రించి వారి ఫోన్ నెంబ‌ర్ల‌ను విగ్రహాల దగ్గర ప్రదర్శిస్తారు. న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు పర్యావరణ అనుకూలమైన గణేశ విగ్రహాలను తయారు చేసే కళాకారులు, పండళ్లను ఏర్పాటు చేసే వారి గురించి సమాచారాన్ని విస్తృతంగా ప్రచారం చేయాల‌ని ఉద్దేశంతో జీహెచ్ఎంసీ ఉంది.

మంగళవారం జీహెచ్‌ఎంసీ ఎల్‌బీ నగర్‌ జోనల్‌ కార్యాలయంలో మట్టితో గణేష్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయగా, మరో రెండు రోజుల్లో సికింద్రాబాద్‌ జోనల్‌ కార్యాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుంది. ఆగస్టు 31న గణేష్ చతుర్థి ఉత్సవాలు ప్రారంభం కానుండగా.. ఈ నెలలోనే గణేష్ పండల నిర్వాహకులు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్‌లతో సమన్వయం చేసుకుని పర్యావరణ అనుకూల విగ్రహాల వైపు మార్గనిర్దేశం చేయాలని అధికారులు నిర్ణ‌యించారు. అదే సమయంలో ప్లాస్ట‌ర్ ఆఫ్ పారిస్‌, సింథటిక్ రంగుల వల్ల పర్యావరణానికి కలిగే హానిపై విగ్రహాల తయారీదారులకు కూడా అవగాహన కల్పించే ప్రయత్నం కూడా ఉంటుంద‌ని అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీతో పాటు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ కూడా పండుగకు ముందు మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తుంది. మట్టి విగ్రహాలను తయారు చేసే వారిని రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుంది. ఈ సంవత్సరం హుస్సేన్ సాగర్, విగ్రహాలు నిమజ్జనం చేసే ఇతర నీటి వనరులను నిశితంగా పరిశీలిస్తామని, నీటి లో పిఒపి విగ్రహాలను నిమజ్జనం చేయడాన్ని నిషేధిస్తూ హైకోర్టు ఆదేశాలను ఉన్నాయ‌ని అధికారులు గుర్తు చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • eco friendly ganesh idols
  • ganesh idols
  • GHMC
  • hyderabad

Related News

Death

Minior Girl : హైదరాబాద్‌లో మైనర్ బాలిక ఆత్మహత్య

హైద‌రాబాద్‌లో మైన‌ర్ బాలిక ఆత్మ‌హ‌త్య ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపుతుంది. సైదాబాద్ సింగరేణి కాలనీలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌ పాల్పడే ముందు ఆమె సూసైడ్ నోట్ రాసిన‌ట్లు స‌మాచారం. కుటుంబ సభ్యులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. అదే ప్రాంతంలో నివసిస్తున్న ఒక యువకుడి నుంచి ఆమె వేధింపులకు గురవుతోంద‌ని..కొంతకాలంగా భావోద్వేగ, మానసిక క్షోభకు గురవుతోందని వారు తెలిపారు. ఘటన జరిగిన తర్వా

  • Pavan Kalyan (1)

    JSP : హైద‌రాబాద్‌లో జ‌న‌సేన స‌భ‌కు పోలీసుల అనుమ‌తి నిరాక‌ర‌ణ‌

  • RCB FANS

    HYD : ఐపీఎల్ సంబ‌రాలు.. హైద‌రాబాద్‌లో ఆర్సీబీ అభిమానుల ర‌చ్చ‌.. పోలీసుల లాఠీఛార్జ్‌

  • HYDRAA

    HYDRAA : పుప్పలగూడ‌ ముష్కిన్ చెరువులో హైడ్రా భారీ ఆపరేషన్..

  • Tbjp Chief Ramchandar Rao

    BJP : గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఓట్ల కోస‌మే ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌.. కాంగ్రెస్‌పై టీబీజేపీ చీఫ్ ఫైర్‌

Latest News

  • CM DK SHIVAKUMAR : కర్ణాటక ముఖ్యమంత్రిగా నేడు డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం

  • Fraud :సూర్యాపేట‌లో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి భారీ మోసం

  • Accident : గుజరాత్-మహారాష్ట్ర హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. రెండు బ‌స్సులు ఢీ.. 7గురు మృతి

  • AP : గోదావరి పుష్కరాలు-2027పై సీఎం చంద్రబాబు సమీక్ష ..త్వరలో పుష్కర లోగో విడుదల

  • Pawan Kalyan: తెలంగాణలో పోటీ చేస్తాం పవన్ కళ్యాణ్

Trending News

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd