Goutam Sawang: ఏపీపీఎస్సీ చైర్మన్‌గా గౌతమ్ సవాంగ్
ఏపీపీఎస్సీ చైర్మన్‌గా ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్ నియమితులయ్యారు.
- By HashtagU Desk Published Date - 11:30 AM, Thu - 17 February 22

ఏపీపీఎస్సీ చైర్మన్‌గా ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్ నియమితులయ్యారు. రెండు రోజుల క్రితం డీజీపీ పోస్టు నుంచి గౌతమ్ సవాంగ్‌ను ఏపీ ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తుదిపరి ఉత్తర్వులు వచ్చే వరకు గౌతమ్ సవాంగ్‌ను జీఏడీకి రిపోర్టు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఆయన్ను ఏపీపీఎస్సీ చైర్మన్ నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం ప్రకటన వెలువడింది. ఇక రెండు రోజుల క్రితం వరకు ఏపీ డీజీపీగా కొనసాగిన గౌతమ్ సవాంగ్‌ను అకస్మాత్తుగా ఎందుకు బదిలీ చేశారనేది తెలియాల్సి ఉంది.