Ganta Srinivasa Rao: నా రాజీనామాను వెంటనే ఆమోదించండి..!
- Author : HashtagU Desk
Date : 14-03-2022 - 12:53 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సోమవారం నాడు లేఖ రాశారు. తన రాజీనామాను ఆమోదించాలని ఆ లేఖలో గంటా శ్రీనివాసరావు స్పీకర్ తమ్మినేని సీతారాంను కోరారు. ఇక విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ, 2021 ఫిబ్రవరి 12వ తేదీన గంటా శ్రీనావాసరావు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రాజీనామాను స్పీకర్ ఇంకా ఆమోదించలేదు.
ఇక తన రాజీనామా లేఖను గంటా శ్రీనివాసరావు స్పీకర్ ఫార్మాట్‌లో పంపారు. అయితే ఏడాది గడుస్తున్నా గంటా శ్రీనివాసరావు రాజీనామాపై స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలో గతంలో ఒకసారి వ్యక్తిగతంగా శ్రీకాకుళం జిల్లాలో స్పీకర్‌ను కలసి తన రాజీనామాను ఆమోదించాలని గంటా కోరారు. అయితే ఇప్పటి వరకు తన రాజీనామాను స్పీకర్ ఆమోదించలేదు. దీంతో మరోసారి తన రాజీనామా లేఖను వెంటనే ఆమోదించాలని స్పీకర్‌కు లేఖ రాశారు. ఇక గత ఏడాడి ఫిబ్రవరిలో తన రాజీనామా లేఖ స్పీకర్‌కు పంపిన నాటి నుంచి గంటా శ్రీనివాసరావు అసెంబ్లీకి హాజరు కావడం లేదనే విషయం తెలిసిందే.