4 Killed : అమెరికాలో కాల్పుల కలకలం.. బర్త్‌డే పార్టీలో ఘటన
అమెరికాలో కాల్పుల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రతి రోజు ఏదోఒక చోట కాల్పుల మోత మోగుతూనే ఉంది. తాజాగా ఓ బర్త్‌డే
- By Prasad Published Date - 07:27 AM, Mon - 17 April 23

అమెరికాలో కాల్పుల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రతి రోజు ఏదోఒక చోట కాల్పుల మోత మోగుతూనే ఉంది. తాజాగా ఓ బర్త్‌డే పార్టీలో కాల్పులు కలకలం సృష్టించాయి. అమెరికాలోని అలబామా రాష్ట్రంలో శనివారం రాత్రి జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడినట్లు తెలుస్తుంది. తూర్పు అలబామాలోని డాడెవిల్లే నగరంలో పుట్టినరోజు వేడుకలో కాల్పులు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. మహోగని మాస్టర్‌పీస్ డ్యాన్స్ స్టూడియోలో 16వ పుట్టినరోజు వేడుకలో కాల్పులు జరిగాయని, బాధితుల్లో ఎక్కువ మంది యువకులేనని నివేదికలు పేర్కొన్నాయి. ఘటనపై అక్కడి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాల్పులకు గల కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.