Benefits of Hug: కౌగిలితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా..?
తమకు నచ్చినవాళ్లను కౌలిగిలించుకుంటే వచ్చే ఆనందాన్ని మాటల్లో చెప్పలేము.
- By Hashtag U Published Date - 06:12 PM, Sat - 23 April 22
తమకు నచ్చినవాళ్లను కౌలిగిలించుకుంటే వచ్చే ఆనందాన్ని మాటల్లో చెప్పలేము. అవతలివారిని ప్రేమతో కౌగిలించుకుంటే…ఆ సమయంలో మనలో ఆనందం కలుగుతుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కౌగిలించుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. దీని వల్ల శారీరకంగా, మానసికంగా ఎంతో ప్రశాంతంగా ఉంటుందని చెబుతున్నారు. కౌగిలింత అనేది మానవ సంబంధాలలో అన్యోన్యతను సూచించే ఒక పద్దతి. ఇది సాధారణంగా ఒకరిని మరొకరు చేతులతో చుట్టుకుని తెలియచేస్తారు. ఇది మానవులలో ప్రేమ, అభిమానాన్ని చూపేందుకు ఎక్కువమంది కౌగిలించుకుంటారు.
చాలా దేశాల్లో అన్ని వయస్సుల స్త్రీ, పురుషులు అతి సామాన్యంగా అభిమానాన్ని చూపే విధానం ఆనందాన్ని, సంతోషాన్ని మాత్రమే కాదు..కౌగిలించుకోవడం వల్ల కష్టాల్లో ఉన్న వ్యక్తిని ఓదార్చడానికి నేనున్నాని ధైర్యం చెబుతుంది. కొన్ని దేశాల్లో కొత్త వ్యక్తిని కలిసినప్పుడు కౌగిలితో పలకరిస్తారు. కౌగలించుకోవడం అనేది ఆరోగ్యపరంగా మంచిదట. ఎలాగో తెలుసుకుందాం.
కౌగిలించుకుంటే ఆయుష్షు పెరుగుతుందట..
కౌగిలించుకోవడం వల్ల స్త్రీలలో ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుందని రక్తపోటు తగ్గుతుందని ఓ పరిశోధనలో తేలింది. అయితే కౌగిలించుకుంటే ఆయుష్షు కూడా పెరుగుతుందట. చాలా మంది రోజంతా పనిచేస్తుంటారు. అది శారీరకంగా కావొచ్చు…మానసికంగా కావొచ్చు. దీంతో త్వరగా అలసిపోతారు. ఆ సమయంలో హగ్ చేసుకుంటే చాలా వరకూ ఆ వ్యయ ప్రయాసలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు
రిలాక్స్ గా ఉంటుంది…
ఒక్క కౌగిలింత ఎంతో రిలాక్స్ గా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. మానసిక, శారీరక, ఒత్తిడిలు అన్నీ కూడా ఒక్క హగ్ తో దూరం అవుతాయంటున్నారు. భార్యభర్తలు కౌగిలించుకోవడం వల్ల దంపతులు ఎక్కువ కాలం బతుకుతారని చెబుతున్నారు నిపుణులు. అంతేకాదు చూడటానికి యవ్వనంగా కనిపిస్తారట. భార్యభర్తలు రోజుకు ఒకసారైనా తమ భాగస్వామిని ప్రేమతో కౌగిలించుకోవాలని సూచిస్తున్నారు. ఈ ప్రక్రియ వల్ల వారి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుందంటున్నారు నిపుణులు.
ఎందుకలా…
కౌగిలించుకున్నప్పుడు మనలో ఆక్సిటోసిన్, డోపమైన్, సెరోటోనిన్ అనే రసాయనాలు రిలీజ్ అవుతాయి. మనలో రిలాక్స్ ను పెంచుతాయి. దీంతో ఒకసారిగా మూడ్ మారిపోతుంది. ఒత్తిడి తగ్గిపోతుంది. హైబీపీ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఇలా చేస్తే బాడీ పెయిన్స్, నొప్పులు కూడా దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. మనం ఎవరినైనా కౌగిలించుకున్నప్పుడు మనలోని థైమస్ గ్రంథి ఉత్తేజానికి గురవుతుందట. దీంతో మన శరీరంలోని తెల్ల రక్తకణాల సంఖ్య పెరుగుతుందట. రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారి వ్యాధులు రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే అప్పుడప్పుడు తెలిసినవారిని, స్నేహితులను హగ్ చేసుకోండి. అంతేకానీ ఎవరినీ పడితే వారి కౌగిలించుకుంటే కష్టాలు తప్పవు.
Related News
Parenting: పిల్లలను పరీక్షలకు సంసిద్ధం చేయండిలా
Parenting: పరీక్షల సీజన్ వచ్చేసింది. అయితే పిల్లల చదువుల కంటే తల్లిదండ్రుల ఆందోళన ఎక్కువగా ఉంటుంది. అయితే పరీక్షా రోజుల్లో పిల్లలు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితిలో తల్లిదండ్రులు తమ పిల్లలను ఒత్తిడి నుండి రక్షించగల సులభమైన మార్గాలను పాటించాలి. ఏ బిడ్డకైనా దాని తల్లిదండ్రుల భావోద్వేగ మద్దతు చాలా ముఖ్యం. ప్రత్యేకించి పరీక్షల సమయంలో తల్లిదండ్రుల మద�