Obamas Chef Dead : ఒబామా పర్సనల్ చెఫ్ మృతి.. మాజీ ప్రెసిడెంట్ ఇంటికి సమీపంలోనే డెడ్ బాడీ
Obamas Chef Dead : అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యక్తిగత చెఫ్ 45 ఏళ్ల టఫారి క్యాంప్ బెల్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.
- Author : Pasha
Date : 25-07-2023 - 11:23 IST
Published By : Hashtagu Telugu Desk
Obamas Chef Dead : అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యక్తిగత చెఫ్ 45 ఏళ్ల టఫారి క్యాంప్ బెల్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.
ఒబామా ఇంటికి సమీపంలోని ఎడ్గార్‌టౌన్ గ్రేట్ పాండ్ చెరువులో పాడిల్ బోర్డింగ్ కు వెళ్లిన టఫారి క్యాంప్ బెల్ మునిగిపోయాడు.
దీనిపై మసాచుసెట్స్ స్టేట్ పోలీసులకు తోటి పాడిల్ బోర్డర్ సమాచారాన్ని అందించాడు.
వెంటనే ఎమర్జెన్సీ టీమ్, గజ ఈతగాళ్లు వచ్చి గాలించినా టఫారి క్యాంప్ బెల్ డెడ్ బాడీ దొరకలేదు.
చివరకు సోనార్ ను ఉపయోగించి అతడి మృతదేహాన్ని గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు.
Also read : Anupama Parameswaran : జిమ్ చేస్తూ అనుపమ కొత్త ఫోటోషూట్
ఈ ప్రమాదం జరిగిన టైంలో ఒబామా, ఆయన భార్య మిచెల్ ఒబామా ఇంట్లో లేరు. మసాచుసెట్స్ లోని మార్తాస్ వైన్యార్డ్‌లో దాదాపు 7,000 చదరపు అడుగుల భవనాన్ని 2021లో ఒబామా కుటుంబం కొనుగోలు చేసింది. అప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో చెఫ్ గా క్యాంప్‌బెల్ పనిచేస్తున్నాడు. “క్యాంప్‌బెల్ మా జీవితంలో భాగమయ్యాడు. అతడు ఇక లేడని తెలిసి మా గుండెలు పగిలిపోయాయి. క్యాంప్‌బెల్ భార్య షెరిస్, వారి కవల అబ్బాయిలు జేవియర్, సావిన్ లను తలుచుకుంటే బాధేస్తోంది” అని ఒబామా ఒక ప్రకటనలో తెలిపారు.
Also read : Allu Arjun-Threads Record : ఒక్క పోస్టుతో 1 మిలియన్ ఫాలోయర్స్.. థ్రెడ్స్ లో బన్నీ హవా