Allu Arjun-Threads Record : ఒక్క పోస్టుతో 1 మిలియన్ ఫాలోయర్స్.. థ్రెడ్స్ లో బన్నీ హవా
Allu Arjun-Threads Record : హీరో అల్లు అర్జున్ దుమ్ము లేపాడు. ఇటీవల ఫేస్ బుక్ ప్రారంభించిన మరో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ థ్రెడ్స్ లో కొద్ది రోజుల్లోనే 10 లక్షల మంది ఫాలోయర్లను సంపాదించాడు.
- By Pasha Published Date - 09:16 AM, Tue - 25 July 23

Allu Arjun-Threads Record : హీరో అల్లు అర్జున్ దుమ్ము లేపాడు. ఇటీవల ట్విట్టర్ కు పోటీగా ఫేస్ బుక్ ప్రారంభించిన సరికొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ “థ్రెడ్స్”(Threads)లో కొద్ది రోజుల్లోనే 10 లక్షల మంది ఫాలోయర్లను సంపాదించాడు. దీంతో థ్రెడ్స్ ప్లాట్‌ఫామ్‌లో ఇప్పటివరకు ఇంత పెద్దసంఖ్యలో ఫాలోయర్స్ ను సంపాదించిన తొలి ఇండియన్ మూవీ స్టార్ గా అల్లు అర్జున్ రికార్డును నెలకొల్పాడు. థ్రెడ్స్ లో అల్లు అర్జున్ ఇప్పటివరకు ఒకే ఒక పోస్ట్ చేశాడు. అయినా కొన్ని రోజుల్లోనే 10 లక్షల మంది ఫాలో బటన్ నొక్కడం.. ఆయన సంపాదించిన పాపులారిటీకి నిదర్శనం.
Post by @alluarjunonlineView on Threads
Also read : CM KCR: టమాటా రైతుల్ని అభినందిన సీఎం కేసీఆర్
పుష్ప మూవీతో అల్లు అర్జున్ కు పాన్ ఇండియా ఇమేజ్(Allu Arjun-Threads Record) వచ్చింది. అభిమానులు అతన్ని “సోషల్ మీడియా కింగ్” అని కూడా పిలుస్తుంటారు. ఇక “పుష్ప 2” మూవీ సృష్టించే తుఫాను కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే “పుష్ప: ది రూల్” మూవీలో అల్లు అర్జున్ కనిపించనున్నాడు. ఇందులో ఫహద్ ఫాసిల్, రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Also read : 700 Myanmar Nationals Entry : మయన్మార్ నుంచి మణిపూర్ కు వందలాది మంది వలస.. ఎందుకు ?