HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Former Minister Harish Rao Participates In Dheeksha Diwas Event In Siddipet

Harish Rao At Deeksha Diwas: సిద్దిపేటలో దీక్షా దివస్ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు..

దీక్ష దివస్ కార్యక్రమంలో ఉద్యమకారులందరిని కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని మాజీ మంత్రి హరీష్ రావు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీలో ఆ రోజున జరిగిన ఉద్యమ జ్ఞాపకాలు నెమరువేసుకున్నట్టు చెప్పారు.

  • By Kode Mohan Sai Published Date - 03:26 PM, Fri - 29 November 24
  • daily-hunt
Harish Rao Speech In Deeksha Diwas
Harish Rao Speech In Deeksha Diwas

దీక్ష దివస్ కార్యక్రమంలో ఉద్యమకారులందరిని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటుచేసిన ఫోటో గ్యాలరీ చూస్తే ఆరోజు దీక్షలో కూర్చున్న ఆనాటి ఉద్యమ జ్ఞాపకాలు నెమరు వేసుకున్నట్టు అనిపించింది. తెచ్చుకున్న తెలంగాణ పదిలంగా ఉండేందుకు కేసీఆర్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు.రాష్ట్ర సాధన కోసం చెమట చుక్కలు చిందించిన ఉద్యమకారులందరినీ పార్టీ తప్పకుండా కాపాడుకుంటుంది. దొంగలను మళ్ళీ పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదు.

నవంబర్ 29 దీక్ష దివస్ కు చాలా ప్రత్యేకత తెలంగాణ ఉద్యమంలో ఉంది.1956 నుండి మనకు అన్యాయం జరిగిందని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేస్తూ వచ్చాం. తెలంగాణ ఆంధ్రతో కలిస్తే అన్యాయం జరుగుతుందన్న మేధావుల భయం నిజమైంది. 1969 ఉద్యమంలో అన్ని పోరాటాలు చేసినా తెలంగాణ రాష్ట్రం రాలేదు. ఎంతోమంది ప్రాణ త్యాగం చేసినా తెలంగాణ రాలేదు.తెలంగాణ వస్తదా రాదా అన్న ఒక సందేహం తెలంగాణ సమాజంలో బలంగా ఉండేది.

మనం 11 మంది ఎంపీలు గెలిచినప్పుడు కూడా తెలంగాణ రాలేదు అనే భయం ఉండేది. ఝార్ఖండ్, ఛత్తీస్ గడ్ ,ఉత్తరాఖండ్ మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఆశలు మళ్ళీ చిగురించాయి.

అప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక నాయకత్వం కావాలని అందరి ఎదురుచూస్తున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ గారు పెళ్లి చేసుకోకుండా తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే వారి జీవితాన్ని త్యాగం చేశారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాయకుడు రాకపోతాడా అని ఎదురు చూస్తున్నప్పుడు, అప్పుడే కెసిఆర్ గారు జై తెలంగాణ నినాదంతో బయలుదేరారు.

2001 ఏప్రిల్ 27వ తేదీన జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం మొదలుపెట్టారు. ఇదే సిద్దిపేట గడ్డ నుండి తను నమ్మిన దైవానికి దండం పెట్టుకొని జలదృశ్యానికి వెళ్లి అక్కడ పార్టీని ప్రకటించారు. 2004లో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకునే నాటికి తెలంగాణ ప్రాంతంలో బలమైన రాజకీయ శక్తిగా ఎదిగింది. కాంగ్రెస్ పార్టీ జై తెలంగాణ అని అంటేనే పొత్తుకి ఒప్పుకున్నాము.

కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ గవర్నమెంట్లో మంత్రి పదవి తీసుకోమంటే కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ రాష్ట్రం ఇస్తామని రాస్తేనే ప్రభుత్వంలో చేరుతాము అని షరతు పెట్టిండు కేసీఆర్. కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని చెప్పిన తర్వాతే క్యాబినెట్లో చేరారు.

సోనియా గాంధీ గారి తరపున ఆనాటి కాంగ్రెస్ సీనియర్ లీడర్ ప్రణబ్ ముఖర్జీ గారు కేసీఆర్ గారిని కలిశారు. ఆరోజు కేంద్ర ప్రభుత్వం పడిపోయే పరిస్థితి వస్తే పొత్తులో భాగంగా తన మంతృత్వ శాఖను కూడా త్యాగం చేశారు.

‘ద కోయిల్యూషన్ ఇయర్’ అనే పేరుతో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో వారు కేసీఆర్ గురించి గొప్పగా చెప్తారు. ఏ శాఖ మీకు కావాలి అనే ప్రణబ్ ముఖర్జీ గారు అడిగినప్పుడు నేను శాఖ కోసం రాలేదు మంత్రి పదవి కోసం రాలేదు నాకు కావాల్సింది తెలంగాణ రాష్ట్రం అని సమాధానం చెప్పారు. కెసిఆర్ గారిలో తెలంగాణ రాష్ట్రం కోసం వారి నిబద్ధతను చూశాను అని రాశారు.

ఈరోజు ఎవరెవడో కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారు. కెసిఆర్ పనిచేయకపోయి ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా? కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టి 2004 నుండి 2009 వరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించకుండా ఇబ్బందులు పెట్టింది కాంగ్రెస్.

రాజశేఖర్ రెడ్డి గారిని తెలంగాణ రాష్ట్రం గురించి అసెంబ్లీలో అడిగితే 100 కోట్ల మంది ఒప్పుకుంటేనే తెలంగాణ ఇస్తామని ఎద్దేవా చేసేవారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి ఇదేమైనా సిగరెటా బిరియానీనా అని అవహేళన చేసేవారు. ఇకపై హైదరాబాదుకు వెళ్లాలంటే పాస్పోర్ట్ వీసా కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా రెచ్చగొట్టారు.

టిఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని ఇక్కడ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి కాంగ్రెస్ పార్టీలో కలుపుకున్నారు. కేసీఆర్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినా కాంగ్రెస్ పార్టీకి చలనం రాలేదు. ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు కూడా రాజీనామా చేశాం.

తెలుగుదేశం పార్టీ చేత కూడా జై తెలంగాణ అనిపించింది కేసీఆర్. తెలంగాణకు అనుకూలమని తెలుగుదేశం పార్టీతో తీర్మానం చేయించింది కేసీఆర్. ఎన్నికల తర్వాత మళ్లీ తెలుగుదేశం పార్టీ కూడా మాట మార్చింది. బిజెపి ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని మోసం చేసింది. కాంగ్రెస్ పార్టీ కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టి తెలంగాణ రాష్ట్రం ఇస్తానని మోసం చేసింది. తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అనుకూలమని ప్రకటన చేసి తర్వాత మాట మార్చి మోసం చేసింది. తెలంగాణ ప్రజల ఓట్ల కోసం మాయమాటలు చెప్పి మోసం చేశారు.

హైదరాబాద్ ఫ్రీ జోనని సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చింది. మన హైదరాబాద్ మనకు కాకుండా పోతుంది మన పిల్లలకు ఉద్యోగాలు రాకుండా పోతాయని ఫ్రీ జోన్ పై పెద్ద ఎత్తున ఆందోళన చేసింది కేసీఆర్.

సిద్దిపేటలో ఉద్యోగ గర్జనకు శ్రీకారం చుట్టింది టిఆర్ఎస్ పార్టీ. అక్టోబర్ 12 2009 సిద్దిపేట అంబేద్కర్ భవన్లో ఉద్యోగ గర్జన సన్నాహాక సమావేశంలో మాట్లాడుతూ హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదు ప్రాణాలు తెగించైనా సరే హైదరాబాద్ ను కాపాడుకుంటామని ప్రకటించారు. ఆ నినాదమే తెలంగాణ ఉద్యమ రూపురేఖలను మార్చింది. కావలిస్తే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని సిద్దిపేట గడ్డపై నుంచి ప్రకటించారు. కెసిఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదం ఇచ్చారు. అక్టోబర్ 21 ఉద్యోగ గర్జన పెద్ద ఎత్తున విజయవంతమైంది.

నవంబర్ 29న సిద్దిపేట కేంద్రంగా ఆమరణ దీక్షకు కూర్చుంటానని కేసీఆర్ గారు ప్రకటించారు. నిరాహార దీక్ష కార్యక్రమాన్ని నిర్వీర్యం చేసేందుకు వేలమంది పోలీసులకు సిద్దిపేటకు వచ్చారు. ఎముకలు కొరికే చలిలో కూడా వేలమందితో దీక్ష శిబిరాన్ని కాపాడుకున్నాం. దీక్షా శిబిరానికి వస్తున్న కేసీఆర్ ను కరీంనగర్లో అరెస్ట్ చేసి ఖమ్మంకి తరలించారు. ఖమ్మంలో అయితే తెలంగాణ ఉద్యమం అంతగా ఉండదు అని రోశయ్య గారు ఖమ్మం తరలించారు.

కెసిఆర్ గారి అరెస్టుకు నిరసనగా మేము కూడా సిద్దిపేటలో నిరాహార దీక్షకు కూర్చున్నాం. 2000 మంది పోలీసులు వచ్చి దీక్షా శిబిరాన్ని పోల్చి లాఠీచార్జ్ చేసి నాతోపాటు వేల మందిని సిద్దిపేటలో అరెస్టు చేసి మెదక్ జైల్లో పడేశారు.

అయినా పోరాటం ఆగలేదు. కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు రాజయ్య యాదవ్ గారు, నాయని నరసింహారెడ్డి గారు కేసీఆర్ గారితో ఖమ్మం జిల్లాలో ఉన్నారు. ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది శ్రీకాంతచారి ఆత్మబలిదానం చేసుకున్నారు. ఉద్యోగస్తులు, లాయర్లు, ప్రజలు పెద్ద ఎత్తున ఖమ్మం చేరుకున్నారు. డిసెంబర్ మూడో తేదీన కెసిఆర్ గారి ఆరోగ్యం క్షీణిస్తోందన్ని హైదరాబాద్ నిమ్స్ కి తరలించారు. పిట్టు పెట్టుకున్న పార్టీలు మోసం చేస్తుంటే రాజకీయ ప్రక్రియలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధిద్దాం అనుకున్న రాజకీయ పార్టీలు మోసం చేశారు.

మహాత్మా గాంధీ గారి మార్గంలో నిరాహార దీక్షతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని బయలుదేరారు కేసీఆర్. అన్ని వర్గాలు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రోడ్డుపై కొచ్చి కెసిఆర్ గారికి మద్దతుగా పోరాడాయి. తెలంగాణ సమాజం కేసిఆర్ కు ఏమన్నా అయితదమో అని భయపడింది. అయితే తెలంగాణ జైత్రయాత్ర, లేకపోతే కెసిఆర్ శవయాత్ర అని పట్టుదలతో కూర్చున్నారు. కెసిఆర్ గారికి ఏమైనా అయితే తెలంగాణ అగ్నిగుండం అవుతుంది. తెలంగాణ సమాజమంతా ఏకమైంది అన్న విషయం తెలుసుకున్నది ఢిల్లీ కాంగ్రెస్.

కేంద్ర హోం మంత్రి చిదంబరం జయశంకర్ సార్ తో ఫోన్లో మాట్లాడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తానని, దీక్షను విరమించాలని విజ్ఞప్తి చేశారు. ప్రకటన వచ్చిన తర్వాతే దీక్ష విరమిస్తానని కెసిఆర్ గారు తేల్చి చెప్పారు. ఏమని ప్రకటన చేయాలో మీరే రాసి పంపితే మేము ప్రకటిస్తామని చిదంబరం అడుగుతే. జయశంకర్ సార్ చేతులతో రాసిన పదాలనే ఆనాడు చిదంబరం చదివి వినిపించారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రకటన కెసిఆర్ గారి త్యాగ ఫలితం. డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన రోజు అన్ని పండుగలు కలిసి ఒక్కరోజే వచ్చినట్టు తెలంగాణ సమాజం పండుగలా జరుపుకుంది. ఆ సంతోషాన్ని సమైక్య శక్తులు ఎక్కువ కాలం లేకుండా చేశాయి.

తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆంధ్ర ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం మొదలుపెట్టారు. తెలంగాణలో మళ్లీ ఉద్యమం మొదలైంది. అన్ని ప్రాంతాల్లో నిరాహార దీక్ష శిబిరాలు వంటవార్పు, రాస్తారోకో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామా చేయమంటే వెన్నుచూపి పారిపోయిన వాడు రేవంత్ రెడ్డి. ఆరోజు ఎవరు రాజీనామా చేసినారు? మేము తప్ప. కిషన్ రెడ్డి రాజీనామా చేయమంటే చేయకుండా ఢిల్లీ పారిపోయాడు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్ర కోసం రాజీనామా చేయమంటే జిరాక్స్ పేపర్లు ఇచ్చారు ఆ జిరాక్స్ పేపర్ కూడా రేవంత్ రెడ్డి ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా రాజీనామా ఇవ్వని వ్యక్తి రేవంత్ రెడ్డి. డిసెంబర్ 24 నాడు దీక్షా శిబిరాన్ని సిద్దిపేటలో ప్రారంభిస్తే 1531 రోజులపాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగే వరకు దీక్ష శిబిరాన్ని కొనసాగించాము.

దేశ స్వతంత్రం కోసం పోరాడిన సమర యోధులది ఎంత గొప్ప పాత్రనో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులది కూడా అంతే గొప్ప పాత్ర. తెలంగాణ ఉద్యమంలో 350 పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి మమ్మల్ని అణచివేయాలని చూశారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఉద్యమకారుడు మీద వందల్లో కేసులు నమోదయ్యాయి.

ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఒక కేసైనా ఉందా? ఎప్పుడైనా జై తెలంగాణ అని అన్నాడా? అమరులకు ఎప్పుడైనా ఒక పువ్వు పెట్టాడా? రేవంత్ రెడ్డి మీద ఒక కేసు అయితే అయింది.. అది ఓటుకు నోటు కేసు!

రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తాడట. నవంబర్ 29 నలుగునూరు చౌరస్తాలో కేసీఆర్ ను అరెస్టు చేసిన ఆనాటి ఆనవాళ్లు లేకుండా చేస్తావా? ఖమ్మం జిల్లాలో మూడు రోజులు పెట్టిన ఆనవాళ్ళు లేకుండా చేస్తావా? డిసెంబర్ 9 నాటి తెలంగాణ రాష్ట్ర ప్రకటన ఆనవాలు లేకుండా చేస్తావా? ఏ ఆనవాళ్లు లేకుండా చేస్తావు రేవంత్ రెడ్డి? జూన్ 2న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఆనవాలు లేకుండా చేస్తావా?

కెసిఆర్ లేకపోతే నవంబర్ 29 లేదు. కేసీఆర్ లేకుంటే డిసెంబర్ 9 లేదు .కేసీఆర్ లేకపోతే జూన్ రెండు లేదు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు. జై తెలంగాణ అన్న వారిపై తుపాకీ పట్టుకొని బయలుదేరిన నీ మరకను చెరపలేవు. అది ఎప్పుడు నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. కేసిఆర్ కీర్తిని నువ్వు తుడిచేయలేవు. తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం కేసీఆర్ గారు ఉంటారు.

లగిచర్లలో గిరిజనులు కొట్టిన దెబ్బకు.. ఫార్మా కంపెనీ ఏర్పాటును రేవంత్ రెడ్డి రద్దు చేసుకున్నాడు. మెట్రో రైల్ రద్దు, ఫార్మాసిటీ రద్దు,ఇప్పుడు లగిచర్ల ఫార్మా కూడా రద్దు. కొత్త ఉత్సాహంతో అందరం ముందుకు సాగుదాం. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిద్దాం. జై తెలంగాణ.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • Deeksha Diwas
  • harish rao
  • kcr
  • telangana
  • trs

Related News

Heavy Rains

Alert : 13న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

Alert : ఆంధ్రప్రదేశ్ మాదిరిగానే తెలంగాణలో కూడా ఈ అల్పపీడనం తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా సెప్టెంబర్ 13 తర్వాత వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉంది

  • Kavitha Comments Harish

    Kavitha Vs Harish : నాపై చేసిన ఆరోపణలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నా..కవిత కు ఇన్ డైరెక్ట్ కౌంటర్ ఇచ్చిన హరీశ్

  • Cbi Director

    CBI : హైదరాబాద్ కు సీబీఐ డైరెక్టర్.. కారణం అదేనా..?

  • Hyderabad

    Hyderabad: గ్రేటర్‌లో నిమజ్జనానికి సర్వం సన్నద్ధం!

  • Harish Rao

    Harish Rao: లండ‌న్‌లో జ‌రిగిన మీట్ అండ్ గ్రీట్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న హ‌రీష్ రావు!

Latest News

  • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

  • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

  • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

  • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

  • Viral : రూ.10 వేల కోట్ల ఆస్తి ఫుట్‌బాల్‌ స్టార్‌కి రాసిచ్చిన బిలియనీర్‌

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd