Mohammad Azharuddin: అజహరుద్దీన్ ఇంట విషాదం..!
భారత మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్ ఇంట విషాదం నెలకొంది.
- Author : Gopichand
Date : 18-10-2022 - 9:55 IST
Published By : Hashtagu Telugu Desk
భారత మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్ ఇంట విషాదం నెలకొంది. అజహారుద్దీన్ తండ్రి మహ్మద్ యూసఫ్ అనారోగ్యం కారణంగా మంగళవారం మృతి చెందాడు. కొద్దికాలంగా అజహరుద్దీన్ తండ్రి యూసఫ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. బుధవారం బంజారాహిల్స్ లో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు.
హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడిగా ఉన్న అజహరుద్దీన్‌పై వివాదాలు కొనసాగుతున్నాయి. హెచ్‌సీఏలోని కొంత మంది సభ్యులతో అతనికి పడటం లేదని తెలుస్తోంది. ఇటీవల భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌కి ఉప్పల్ స్టేడియం టికెట్ల అమ్మకంపై పెద్ద వివాదమే నడిచిన విషయం తెలిసిందే.